Health Tips: శరీరం కొద్ది సేపటికే అలసిపోతుందా.. అయితే దానికి కారణం ఇదే కావొచ్చు!

శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే, ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. ఇత్తడి పాత్రలలో ఆహారాన్ని ఉడికించాలి. ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి.బీట్‌రూట్, యాపిల్, బెల్లం, బచ్చలికూర, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు ఆహారాలు తీసుకోవాలి.

Health Tips: శరీరం కొద్ది సేపటికే అలసిపోతుందా.. అయితే దానికి కారణం ఇదే కావొచ్చు!
New Update

Health Tips: హిమోగ్లోబిన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, అన్ని అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు, చాలా అలసట, బలహీనత ఉంటుంది. దీంతో రోజువారీ పనులు కూడా చేయడం కష్టంగా మారుతుంది. ఆరోగ్యకరమైన మనిషి హిమోగ్లోబిన్ 13.5 నుండి 17.5 మధ్య ఉండాలి. ఆరోగ్యవంతమైన మహిళ హిమోగ్లోబిన్ 12 నుండి 15.5 మధ్య ఉండాలి.

హిమోగ్లోబిన్ తగ్గితే ఆహారం, కొన్ని ప్రత్యేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే పెంచుకోవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచే మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

హిమోగ్లోబిన్‌ను ఎలా పెంచాలి?

ఐరన్ అధికంగా ఉండే ఆహారం:

శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే, ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. ఇత్తడి పాత్రలలో ఆహారాన్ని ఉడికించాలి. ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి. బీట్‌రూట్, యాపిల్, బెల్లం, బచ్చలికూర, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, తృణధాన్యాలు, పౌల్ట్రీ ఫుడ్, లీన్ మీట్, ఐరన్ సప్లిమెంట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాలు తీసుకోవాలి.

విటమిన్ సి

- హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్‌తో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉండే వాటిని కూడా డైట్‌లో చేర్చుకోవాలి. దీని కోసం, ఆహారంలో పుల్లని పండ్లు, రసాలను చేర్చుకోవాలి. విటమిన్ సి కోసం, నారింజ, నిమ్మ, బొప్పాయి, ఇతర పండ్లు, కూరగాయలను అధికంగా తినాలి. విటమిన్ సి శరీరానికి ఇనుమును రవాణా చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

విటమిన్ B12, B6, ఫోలేట్

- హిమోగ్లోబిన్ పెంచడానికి, విటమిన్ B12, విటమిన్ B6, ఫోలేట్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం రోజూ యాపిల్, అరటిపండు, టొమాటో, టోఫు, మొలకలు, పుట్టగొడుగులను తినాలి. కావాలంటే, సప్లిమెంట్లను కూడా తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం

- వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. హిమోగ్లోబిన్‌ను పెంచడానికి కొన్ని తేలికపాటి వ్యాయామాలు కూడా చేయాలి.

ధూమపానం, మద్యపానం

- తక్కువ హిమోగ్లోబిన్‌తో బాధపడుతుంటే, ముందుగా ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే మానేయాలి. ఈ రెండు అలవాట్లు శరీరంలో అనేక వ్యాధులను కలిగిస్తాయి. అంతేకాకుండా హిమోగ్లోబిన్‌ను కూడా తగ్గిస్తాయి.

Also read: అధిక కొలెస్ట్రాల్‌ ను ఓట్స్‌, శెనగపిండి తో తరిమికొడదామా!

#blood #himoglobline #iron #health-tips #lifestyle
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe