పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్‌లో అదరగొట్టాడు. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్‌లో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ మెడల్ కొట్టాడు.
Also read: రాహుల్ కుట్టిన షూస్‌కు సూపర్ డిమాండ్
2012 సంవత్సరంలో, స్వప్నిల్ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ల పోటీలో ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయడానికి అతను 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. స్వప్నిల్ కథ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కథను పోలి ఉంటుంది. స్వప్నిల్ కూడా టిక్కెట్ కలెక్టర్ కావడంతో అతని పేరు ఎంఎస్ ధోనితో ముడిపడి ఉంది. ధోని తన కెరీర్‌తో పాటు రైల్వేలో టిక్కెట్ కలెక్టర్‌గా కూడా కొంతకాలం పనిచేశాడు. స్వప్నిల్ ధోని బయోపిక్‌ని చాలాసార్లు చూశాడు. స్వప్నిల్ ధోనీకి వీరాభిమాని.. క్రికెట్ మైదానంలో ధోని ఎలా ప్రశాంతంగా ఉంటాడో, అదే విధంగా తన ఆటకు కూడా ప్రశాంతత, సహనం అవసరం అని చెబుతుంటాడు స్వప్నిల్.