Team India Selection : భారత్, ఇంగ్లండ్(INDIA vs ENGLAND) మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. అందులో ఒకటి ఓడిపోయింది ఇండియా.. ఇంకోటి గెలిచింది. హైదరాబాద్(Hyderabad), విశాఖ(Visakha) వేదిక టెస్టు మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. మరో మూడు టెస్టులు ఈ రెండు జట్ల మధ్య జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు జరగనుంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(రాజ్‌కోట్) లో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి రెండు టెస్టులకే బీసీసీఐ(BCCI) తొలుత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. ఇవాళ(ఫిబ్రవరి 9) సాయంత్రం కానీ.. రేపు మధ్యాహ్నం లోపు కానీ జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. నిజానికి ఈ ఉదయానికే ప్రకటించాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల సెలక్టర్ల మీటింగ్ కాస్త వాయిదా పడినట్టుగా సమాచారం.
Also Read : Pakistan Elections: పాక్ ఆర్మీ లెక్క తప్పిందా.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవబోతుందా..?
కోహ్లీ ఆడుతాడా?
విరాట్ కోహ్లీ(Virat Kohli) తొలి రెండు టెస్టులు ఆడలేదు.. పర్శనల్ రీజన్స్ మీద లీవ్‌లో ఉన్నాడని బీసీసీఐ చెప్పుకొచ్చింది. భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతోనే కోహ్లీ లీవ్ తీసుకున్నాడని మొదట ప్రచారం జరగింది. మరో 'బేబీ' డెలవరీకి అనుష్క రెడీ అయ్యారంటూ కోహ్లీ ఫ్రెండ్, మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీడీవిలయర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు. అయితే ఇదంతా ఫాల్స్ ఇన్ఫో అని తర్వాత మాట మార్చాడు. అంటే అనుష్క ప్రెగ్నెన్సీ రూమర్స్ అవాస్తవంగానే తెలుస్తోంది. అటు కోహ్లీ మమ్మీకి హెల్త్ బాలేదని కూడా ప్రచారం జరిగింది. ఇందులో కూడా నిజం లేని కోహ్లీ బ్రదర్ ఈ వార్తలను ఖండించాడు. మరి కోహ్లీ ఎందుకు ఆడడం లేదన్నదానిపై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులు ఆడాలని కోరుకుంటున్నారు.
మరోవైపు తాను అందుబాటులో ఉంటాడా లేడా అన్నదానిపై కోహ్లీ ఇప్పటివరకు బీసీసీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అందుకే టీమ్ సెలక్షన్ లేట్ అయ్యిందన్న ఊహాగానాలు నెలకొన్నాయి. మరోపై గాయపడ్డ కేఎల్‌రాహుల్, రవీంద్రజడేజా ఫిట్‌నెస్ రిపోర్టులు కూడా రావాల్సి ఉంది. ఇక మూడో టెస్టులకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే బుమ్రాకు రెస్ట్ ఇస్తే పేస్ విభాగం మరింత వీక్ అవుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Also Read: దళిత మహిళపై దారుణం.. నడి బజార్లో నగ్నంగా కట్టేసి కొట్టిన గ్రామ పెద్దలు