Suspected in Rameshwaram Cafe Blast caught in CCTV : బెంగళూరు(Bangalore) లోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe) లో నిన్న(మార్చి 1) జరిగిన పేలుడు(Blast) పై దర్యాప్తు కొనసాగుతోంది. కర్ణాటక పోలీసులతో పాటు కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ విషయంపై నిఘా పెట్టాయి. ముందుగా గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలిందేమోనని అందరు అనుకున్నారు. కానీ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ కేఫ్‌లో బ్యాగ్ పెట్టాడని.. అందులో నుంచే పేలుడు సంభవించినట్లు కర్ణాటక సర్కార్ నిర్ధారించింది. ఇక తాజాగా ఈ కేసుపై కీలక అప్‌డేట్ వచ్చింది.
అరెస్ట్?
బెంగళూరు- ఉద్యాన నగర్‌లోని వైట్‌ఫీల్డ్(White Field) లో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో బాంబును అమర్చిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. హోటల్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి బాంబు పెట్టినట్లు స్పష్టంగా తేలింది. అతడి ముఖకవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మరికొద్ది గంటల్లో అతడిని అరెస్ట్ చేయడం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల(UAPA) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదైంది.
మొదట బాంబు ఉన్న బ్యాగ్‌తో హోటల్‌కు వచ్చిన ఓ వ్యక్తి టోకెన్ కొనుగోలు చేశాడు. కౌంటర్‌లో సెమోలినా ఇడ్లీ తీసుకున్నాడు. ఆ తర్వాత బాంబ్ ఉన్న బ్యాగ్‌ని హోటల్ వాష్ బేసిన్ వద్ద వదిలేశాడు. ఈ ఘటనలో మొత్తం 9మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే భయంతో.. హోటల్ సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు ఆ పేలుడుకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఇక బ్యాగ్‌లో ఉంచిన ఐఈడీ తప్ప, ఆవరణలో మరో బాంబు కనిపించలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ పేలుడులో గాయపడిన తొమ్మిది మంది వ్యక్తుల పేర్లు ఇలా ఉన్నాయి:
హోటల్ ఉద్యోగి ఫరూక్(19)
అమెజాన్ ఉద్యోగి దీపాంశు (23)
స్వర్ణాంబ (49)
మోహన్ (41)
నాగశ్రీ (35)
మోమి (30)
బలరామ్ కృష్ణన్ (31)
నవ్య (25)
శ్రీనివాస్ (67)
Also Read: రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ!