Cricket: అప్పుడు శ్రీశాంత్, ఇప్పుడు స్కై..టీ20 వరల్డ్‌కప్‌ను ఇచ్చిన క్యాచ్

ఈరోజు టీ20 వరల్డ్‌కప్‌ను సౌత్ ఆఫ్రికా ఎగురేసుకుపోయేదే..సూర్యకుమార్ యాదవ్ కనుక ఆ ఒక్క క్యాచ్ పట్టకపోయి ఉంటే. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆ ఒక్క క్యాచ్ పాత జ్ఞాపకాలను తవ్వి తీసింది. 2007లో శ్రీశాంత్ ఇలాగే ఒక్క క్యాచ్‌తో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు.

Cricket: అప్పుడు శ్రీశాంత్, ఇప్పుడు స్కై..టీ20 వరల్డ్‌కప్‌ను ఇచ్చిన క్యాచ్
New Update

Surya Kumar Yadav Catch : టీ20 వరల్డ్‌కప్‌లో సౌత ఆఫ్రికా (South Africa) చాలా బాగా ఆడింది మొదటి నుంచి. నిజానికి ఈరోజు ఫైనల్ మ్యాచ్‌ కూడా ఆ జట్టే గెలవాలి. టీమ్ ఇండియా (Team India) ఇచ్చిన లక్ష్యాన్ని దాదాపు ఛేదించేంత దగ్గరగా వచ్చేసింది ప్రోటీస్ టీమ్. క్లాసెన్, మిల్లర్‌లు చెలరేగి ఆడి..కప్పు వాళ్ళదే అన్న పరిస్థితి తీసకువచ్చారు. క్లాసెన్ అవుట్ అయ్యాక కూడా మిల్లర్ ధాటిగానే ఆడాడు. అదిగో అక్కడే కరెక్ట్‌గా సూర్యకుమార్ యాదవ్ దేవుడిలా అద్భుతమైన క్యాచ్ పట్టి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు.

టీ 20 ప్రపంచకప్ (T20 World Cup) దక్కించుకోవాలంటే సఫారీలకు చివరి మూడో ఓవర్‌లో 16 పరుగులు కావాలి. హార్దిక్ బౌలింగ్ వేస్తున్నాడు. మిల్లర్ షాట్లు కొట్టడానికి రెడగా ఉన్నాడు. మ్యాచ్‌ భారత్‌ చేతి నుంచి చేజారిపోయింది అన్న క్షణం. జెయింట్‌ కిల్లర్‌గా పేరున్న డేవిడ్‌ మిల్లర్‌ అనుకున్నట్లే హార్దిక్‌ పాండ్యా వేసిన తొలిబంతిని ‌ అలవోకగా బౌండరీ అవతలికి కొట్టేశాడు. అందరూ ఆ బంతి సిక్సరే అనుకున్నారు...ఇంకేంటి మ్యాచ్ పోయింది అని డిసైడ్ అయిపోయారు. అప్పుడే... మెరుపు తీగలా దూసుకొచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌... అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
అసాధ్యంలా కనిపించిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌కు ఇవతల అందుకుని... అవతలికి వెళ్తూనే బంతిని మైదానంలోకి విసిరి మళ్లీ చాలా ఒడుపుగా క్యాచ్‌ పట్టేశాడు. రన్నింగ్‌ చేస్తూ పూర్తి బ్యాలెన్సింగ్‌తో బౌండరీ లైన్‌ను తాకకుండా సూర్య చేసిన ఈ విన్యాసం ఈరోజు కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో ఆనందం తాండవించేలా చేసింది. భారత జట్టును విశ్వవిజేతగా నిలబెట్టింది. రోహిత్, విరాట్, కోచ్ ద్రావిడ్ ఎన్నో ఏళ్ళ కలను నెరవేర్చింది. అదే ఆ బంతి కనుక సిక్స్‌ వెళ్తే మొత్తం తారుమారు అయిపోయేది. సమీకరణం అయిదు బంతుల్లో 10 పరుగులుగా మారిపోయేది. బ్యాటర్‌ మిల్లర్‌...ఈ లక్ష్యాన్ని తేలిగ్గానే ముగించేవాడు. అందుకే సూర్య పట్టిన ఈ క్యాచ్చే మ్యాచ్‌ను పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చేలా చేసింది.

2007లో సీన్ రిపీట్..

2007లో భారత్ మొదటిసారి టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ధోనీ నాయకత్వంలో టీమ్ ఇండియా ఫైనల్స్‌లో పాకిస్తాన్‌ (Pakistan) తో తలపడింది. అప్పుడు కూడా చివరి వరకు విజయం పాకిస్తాన్ వెంటే వెళ్ళింది. అదిగో అప్పుడే జోగిందర్‌ శర్మ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ క్యాచ్‌ అందుకోవడంతో భారత్ విజయం సాధించింది. అప్పుడు శ్రీశాంత్‌ చాలా తేలికైన క్యాచ్చే పట్టాడు. కానీ తీవ్రమైన ఒత్తిడిలో అది చేయడం కూడా అద్భతమే. అప్పుడు ఆ క్యాచే భారత జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడేలా చేసింది. ఇప్పుడు కూడా 140 కోట్ల మంది భారతీయుల అభిమానుల ఆశలను మోస్తూ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా అద్భుతమైన క్యాచ్‌ను అందుకుని భారత్‌కు ప్రపంచకప్‌ రావడంలో కీలకపాత్ర పోషించాడు.

Also Read : పెళ్ళి మండపంలో ఆత్మాహుతి దాడి.. 18మంది మృతి..19మంది పరిస్థితి విషమం!

#india #surya-kumar-yadav #t20-world-cup #catch #srisanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe