Telangana : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Taping Case) రోజుకో మలుపు తిరుగుతుంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు(Praneeth Rao) ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా మారిన రవిపాల్. గతంలో ఎస్‌ఐబీ(SIB) లో కన్సల్టెంట్ గా రవిపాల్ వ్యవహరించారు. ప్రణీత్ రావు రవిపాల్ నేతృత్వంలో టాపింగ్ డివైజ్ లను తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రవిపాల్ డివైజ్ లను తీసుకుని వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్ లను రవిపాల్ దిగుమతి చేసుకున్నాడని అధికారులు పేర్కొన్నారు.
ఇందుకోసం రవిపాల్ కి ఎస్‌ఐబీ కోట్ల రూపాయలను చెల్లించినట్లు విచారణలో తెలిసింది. 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినే అధునాతన డివైజ్ లను రవిపాల్ దిగుమతి చేసుకున్నాడు. వాటిని రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఓ ఆఫీస్ తీసుకుని డివైజ్ ఏర్పాటు చేశారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా ప్రణీత్ రావు, రవిపాల్ వినేవారు.
ప్రస్తుతం రవిపాల్(Ravi Pal) ని ప్రశ్నించేందుకు రంగం సిద్దం చేసిన పోలీసు అధికారులు. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లు మాత్రమే కాకుండా
రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను కూడా ప్రణీత్ రావ్ గ్యాంగ్ ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు.
ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన వ్యాపారులను బెదిరించినట్లు అధికారులు గుర్తించారు.
వారికి ఆడియో రికార్డింగ్‌లు వినిపించి ప్రణీత్ రావు డబ్బులు డిమాండ్ చేసేవాడని సమాచారం. అంతేకాకుండా ఆడియోలను వ్యాపారుల ముందుపెట్టి ఎలక్టోరల్ బాండ్స్(Electoral Bonds) కొనిపించినట్టు గుర్తింపు. ఐఏఎస్, ఐపీఎస్, కాంట్రాక్టర్లను కూడా బెదిరించినట్టు అధికారులు గుర్తించారు.
Also Read : మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు!