Telangana : మావోయిస్టు జ్యోతక్క(Maoist Jyothi Akka) లొంగుబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్య(Health Problem) లతో సతమతమవుతున్న ఆమె లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతక్క మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతుంది. అలాగే జ్యోతక్కతోపాటు మరో కొంతమంది కూడా లొంగిపోయేందుకు సిద్ధమయ్యారని, జ్యోతక్కతోపాటు అలియాస్ సాంబలక్ష్మీలు అడవిబాట విడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి : Karimnagar : కరీంనగర్ లో భారీ నగదు సీజ్.. బీఆర్ఎస్ నాయకుడిదేనంటూ ప్రచారం!
30 ఏళ్ల క్రితం అడవి బాట..
ఇక ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న జ్యోతక్క వరంగల్ జిల్లా(Warangal District) ఖానాపూర్ మండలం బుధరావుపేట నివాసి. 30 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిన జ్యోతక్క పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(Special Zonal Committee) లో టైలరింగ్ టీమ్లో(Tailoring Team) సభ్యురాలిగా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం ఆమెను అరోగ్య సమస్యలు వెంటాడుతున్నందున ఆమె జనజీవనస్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు చర్చ నడుస్తోంది. వీలైనంత త్వరగా అటవీ ప్రాంతం నుంచి స్వస్థలానికి రావాలని ఆమె భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.