Maoist : 30 ఏళ్ల అజ్ఞాతవాసం.. లొంగుబాటలో మావోయిస్టు జ్యోతక్క?
మావోయిస్టు జ్యోతక్క అడవిబాట విడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న జ్యోతక్క అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నందునే జనజీవనస్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట నివాసి.