Suresh Raina Shocking Comments : ఐపీఎల్ 17వ సీజన్(IPL 17 Season) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(RCB) ఫేలవ ప్రదర్శనపై ఇండియా(India) మాజీ క్రికెటర్ సురేష్ రైనా(Suresh Raina) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకూ ఒక్క టైటిల్ కూడా నెగ్గని ఆర్ సీబీ ఆటగాళ్ల ప్రదర్శనపై మండిపడ్డారు. స్టార్ ప్లేయర్స్ ఉన్నా.. ప్రతీసారి వారికి కప్ కొట్టడం కలగానే మిగిలిపోతుందని, ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయన్నారు.
పార్టీలు ఎక్కువగా చేసుకుంటున్నాయి..
ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రైనా..‘కొన్ని జట్లు పార్టీలు ఎక్కువగా చేసుకుంటున్నాయి. యాజమాన్యం కూడా పార్టీలను ప్రోత్సహిస్తోంది. నిజానికి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతంగా కొనసాగుతున్న చెన్నై ఎప్పుడూ పార్టీలు ఇవ్వలేదు. అందుకే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై కూడా 5సార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. లేట్ నైట్ పార్టీల వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఆలస్యంగా నిద్రపోతే.. మరుసటి రోజు ఎలా ఆడతారు? మే, జూన్‌లో ఎండలు తీవ్రంగా వుంటాయి. అలాంటప్పుడు మధ్యాహ్నం జరిగే మ్యాచుల్లో చురుగ్గా ఉండాలంటే తగినంత విశ్రాంతి అవసరం. రాత్రంతా పార్టీలు చేసుకుంటే ఎలా? భారత జట్టు తరఫున ఆడేటప్పుడూ ఇలాంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అంటూ పలు సూచనలు చేశాడు.
ఇది కూడా చదవండి: Deep Fake Videos: ఎన్నికల వేళ స్టార్ హిరోల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్..
జూనియర్ ఆటగాడితో ఇలా వ్యవహరించకూడదు..
ఇక కోల్‌కతాతో మ్యాచ్‌లో డుప్లెసిస్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. మ్యాచ్ తర్వాత ఓ జూనియర్ ఆటగాడితో ఇలా వ్యవహరించకూడదు. కెప్టెన్‌గా ఆయన పెద్దగా పరుగులు చేయట్లేదు. యువ క్రికెటర్లను ప్రోత్సహించాలి. రోహిత్ శర్మ ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లోకి నాణ్యమైన ఆటగాళ్లు వస్తున్నారు. క్రికెట్ వారికి మంచి ఎంపిక కావాలని తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.
RCB : కప్ కొట్టడంకంటే వారికి పార్టీలమీదే ధ్యాస ఎక్కువ.. రైనా షాకింగ్ కామెంట్స్
ఈసారైనా ఐపీఎల్ లో కప్ నెగ్గుతుందని భావించిన ఆర్ సీబీ అట్టర్ ప్లాఫ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘లేట్ నైట్ పార్టీల వల్లే ఆ జట్టుకు చాలా నష్టం జరుగుతుంది. ముంబై, చెన్నై జట్లు పార్టీలు చేసుకోలేదు కాబట్టే ఛాంపియన్స్ గా నిలిచాయి’ అన్నాడు.