CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం కోర్టు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది?, అంత టైం ఎందుకు తీసుకున్నారు.. దీనిపై మే 3న సమాధానం చెప్పాలని ఈడీకి సుప్రీం ఆదేశాలిచ్చింది. By V.J Reddy 30 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి షాక్ ఇచ్చింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై ఈడీ పై ప్రశ్నల వర్షం కురిపించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజకీయంగా కేజ్రీవాల్ ను దెబ్బ తీసేందుకు ఈడీ అధికారులు బీజేపీ పెద్దల ఆదేశాలతో అరెస్ట్ చేశారని.. ఇది రాజకీయ కుట్ర అని కేజ్రీవాల్ తరఫున న్యాయవాదికి కోర్టులో వాదనలు వినిపించారు. ALSO READ: సీఎం రేవంత్‌పై ఈడీ, ఐటీ విచారణ జరపాలి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఈ కేసులో కేజ్రీవాల్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్‌ను 2022లో ఈడీ అరెస్టు చేసిందని, కేజ్రీవాల్‌ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందని కోర్టుకు తెలిపారు. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనేదానిపై క్లారిటీ లేదన్నారు. కాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్‌మెంట్ ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఈడీ అధికారులు అంటున్నారని తెలిపారు. అయితే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి మొదటగా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని, ఈడీ అధికారులు ఇబ్బంది పెట్టడం వల్లే మాగుంట మాట మార్చారని కోర్టుకు కేజ్రీవాల్ తరఫు లాయర్ వాదనలు చేశారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ఈడీపై అక్షింతలు చల్లింది. కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, విచారణ ప్రారంభానికి, అరెస్టుకు మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చిందో వివరించాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రశ్నకు శుక్రవారం మే 3న సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. #ed #cm-kejriwal #aap-in-delhi-liquor-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి