Supreme Court Judgement : గతేడాది జనవరిలో అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్(Adani-Hindenburg) రీసెర్చ్ ఒక సంచలన రిపోర్టు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదానీ గ్రూప్ షేర్లు చాలా వరకు కుప్పకూలాయి. అదానీ కంపెనీల మార్కెట్ సామ్రాజ్యం విలువ భారీగా పడిపోయింది. లక్షల కోట్ల అదానీ సంపద అంతా కూడా ఆవిరైపోయింది. ఇదే క్రమంలో ఈ స్టాక్స్ కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు కూడా నష్టల్లో కూరుకుపోయారు. దీంతో ఈ కేసు సుప్రీంకి చేరింది. అదానీ గ్రూప్ పై ఆరోపణలను స్టాక్ మార్కెట్ల నియంత్రన సంస్థ సెబీ కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో నేడు సుప్రీంకోర్టు(Supreme Court) అదానీ హిండెన్ బర్గ్ కేసుపై తీర్పు వెలువరించనుంది.
అదానీ గ్రూప్(Adani Group) పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్(Hindenburg) రీసెర్చ్ చేసిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును వెలువరించనుంది .గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసు అదానీ గ్రూప్ ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ లేవనెత్తిన ఆరోపణలకు సంబంధించినది. ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ప్రమేయాన్ని ప్రేరేపించింది.మార్చి 2023లో, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 6 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని కూడా కోర్టు ఏర్పాటు చేసింది. దీని చైర్మన్ పదవిని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే(Former Judge Justice AM Sapre)కు అప్పగించారు.
హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను తిరస్కరించింది అదానీ గ్రూప్. దీనితో పాటు, డబ్బు వసూలు చేసే వ్యూహాన్ని కూడా మార్చారు. 2023లో, అదానీ గ్రూప్ ఈక్విటీ ద్వారా రూ. 41,500 కోట్లను సమీకరించింది. డెట్ మార్కెట్ నుండి ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. గ్రూప్ రాబోయే దశాబ్దంలో తన ఇన్‌ఫ్రా వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. దీని కోసం 7 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని కూడా ప్రభుత్వం ప్లాన్ చేసింది. వ్యాపారం పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, ఇన్‌ఫ్రా రంగాలలో విస్తరించింది. ప్రస్తుతం గ్రూప్ ఫండింగ్ లో 80 శాతం డెట్ మార్కెట్ నుంచే వస్తోంది. ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపద 84.3 బిలియన్ డాలర్లుగా ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం కారణంగా నేటి ట్రేడింగ్ సెషన్‌లో అదానీ గ్రూప్ షేర్లలో ఒడిదుడుకులు తలెత్తే అవకాశం ఉంది. అదానీ గ్రూప్‌కు చెందిన దాదాపు 10 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి.