Fan Movie: 'ఫ్యాన్‌ మూవీ' కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణకు అనుమతి

బాలీవుడ్ స్టార్ హిరో షారుఖ్ ఖాన్ నటించిన 'ఫ్యాన్‌ ' సినిమా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (NCDRC) ఆదేశాన్ని సవాలు చేస్తూ 'యశ్ రాజ్ ఫిల్మ్స్‌' దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించేందుకు అనుమతించింది.

New Update
Fan Movie: 'ఫ్యాన్‌ మూవీ' కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణకు అనుమతి

Jabra Fan Case: బాలీవుడ్ స్టార్ హిరో షారుఖ్ ఖాన్ నటించిన 'ఫ్యాన్‌ ' (Fan Movie) సినిమా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 'జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్' (NCDRC) ఆదేశాన్ని సవాలు చేస్తూ 'యశ్ రాజ్ ఫిల్మ్స్‌' (Yash Raj Films) దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించేందుకు అనుమతించింది. జస్టీస్ పీఎస్‌ నరసింహ, జస్టీస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశాన్ని పక్కన పెట్టింది. వైఆర్‌ఎఫ్‌(YRF) దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమచినట్లు వెల్లడించింది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Also read: ఎన్నికల వేళ స్టార్‌ హిరోల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్..

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2016లో షారుఖ్‌ ఖాన్ హిరోగా నటించిన 'ఫ్యాన్' అనే సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు దీనికి సంబంధించిన ట్రైలర్, ప్రోమోలను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అయితే అఫ్రీన్ ఫాతిమా జైదీ అనే మహిళ.. తన కుటుంబంతో ఈ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లారు. కానీ ఈ సినిమాలో ట్రైలర్‌లో కనిపించిన 'జబ్రా ఫ్యాన్' అనే పాట లేదు. దీంతో తాము మోసపోయామని భావించిన ఆ మహిళ.. జిల్లా వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేసింది. ఈ సినిమా ట్రైలర్‌లో చూపించిన 'జబ్రా ఫ్యాన్' పాట తన పిల్లలకు చాలా బాగా నచ్చిందని.. ఈ సినిమా చూసేవరకు వాళ్లు అన్నం కూడా తినలేదని చెప్పింది. చివరికి ఈ సినిమా చూశాక అందులో ఆ పాట లేకపోవడంతో తమ పిల్లలకు ఎసిడిటీ స్థాయిలు పెరిగాయని.. చివరికి వాళ్లు ఆసుపత్రిపాలయ్యేలా దారి తీసిందని పేర్కొంది.

కానీ జిల్లా వినియోగదారుల కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అఫ్రీన్‌ ఫాతిమా 'రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్'ను ఆశ్రయించింది. 2017లో రాష్ట్ర కమిషన్‌.. అఫ్రీన్ ఫాతిమాకు రూ. 5 వేల వ్యాజ్యంతో పాటు రూ.10వేలు పరిహారం చెల్లించాలని 'యశ్ రాజ్ ఫిల్మ్స్‌'(YRF) నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 'జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్' కూడా రాష్ట్ర కమిషన్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో 'యశ్ రాజ్ ఫిల్మ్స్‌'(YRF) నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి NCDRC ఇచ్చిన ఆదేశాన్ని పక్కన పెట్టి.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి తెలిపింది.

Also Read: ఉద్యోగాలు కోల్పోనున్న 25 వేల మంది ప్రభుత్వ టీచ‌ర్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు