Supreme Court : మీరు ఇస్తారా.. మమ్మల్నే చేయమంటారా? కోస్ట్‌ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు పై సుప్రీం సీరియస్‌!

ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌ లో మహిళలకు శాశ్వత కమిషన్‌ ను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలకు శాశ్వత కమిషన్‌ కల్పించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Supreme Court : అబార్షన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు
New Update

Supreme Court : ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌(ICG) లో మహిళలకు శాశ్వత కమిషన్‌(Women's Permanent Commission) ను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) చేస్తున్న ఆలస్యం పై సుప్రీం కోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశం గురించి సుప్రీం కోర్టు ఇంతకు ముందు కూడా మాట్లాడింది. సోమవారం మరోసారి విచారణ జరిపింది. మహిళలకు శాశ్వత కమిషన్‌ కల్పించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం కేంద్రానికి వార్నింగ్‌ ఇచ్చింది.

ఈ విషయంలో త్వరితగతిన కేంద్రం చర్యలు తీసుకోకపోతే మాత్రం మేమే ఆ పని చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో కేంద్రం తరుఫున అటార్నీ జనరల్ వెంకటరమణి వివరిస్తూ కోస్ట్‌ గార్డు(Coast Guard) సేవల ఇతర సేవలతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటాయని వివరించారు. దీని గురించి ఐజీసీ ద్వారా ఇప్పటికే బోర్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

దీంతో ధర్మాసనం కలగజేసుకుంటూ 2024లో ఇలాంటి సమర్థత వాదనలకు తావులేదన్నారు. కోస్ట్‌ గార్డు సేవలలో మహిళలను మినహాయించేందుకు ఇవి కారణాలు కాదని తోసిపుచ్చింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పర్మినెంట్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని.. కేంద్రం కానీ ఆ పని చేయకపోతే..సుప్రీం కోర్టే ఆ పని చేస్తుందని వారు వివరించారు.

కేసు విచారణను తిరిగి మార్చి ఒకటో తేదీకి వాయిదా వేసింది. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌(Indian Coast Guard) అధికారి ప్రియాంక త్యాగి వేసిన పిటిషన్‌ గురించి సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గత వారం విచారణ సందర్భంగా త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు గురించి సుప్రీం తీర్పును వెలువరించినప్పటికీ .. కోస్ట్‌ గార్డుల విషయంలో మాత్రం ఇంకా పూర్తకాలంలో ఉన్నారా? అంటూ మొట్టికాయలు వేసింది.

ఆర్మీ, నేవి లో మహిళా అధికారులకు పర్మినెంట్‌ కమిషన్‌ ఇస్తుండగా.. కోస్ట్‌ గార్డు విషయంలో మాత్రం ఎందుకు ఇలా వివక్ష చూపుతున్నారంటూ కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. కోస్ట్‌ గార్డ్‌ ను అలా వదిలివేయలేమంటూ సుప్రీం స్పష్టం చేసింది.

Also Read : బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసా..?

#icg #army #indian-coast-guard #supreme-court #navy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి