Supreme Court: వీవీ ప్యాట్ల లెక్కింపుపై ఈసీకి సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ పై వెంటనే తమ స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని , కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఓటుకు నోటు కేసు విచారణ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
New Update

Supreme Court Notice to Election Commission: ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ పై వెంటనే తమ స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని , కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం గురించి సామాజిక కార్యకర్త అరుణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మోహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలను జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వానికి , ఎన్నికల కమిషన్‌ కి నోటీసులు అందజేసింది. ఈ పిటిషన్‌ గురించి తదుపరి విచారణ మే 17న జరిగే అవకాశాలున్నాయి. సుమారు 24 లక్షల వీవీప్యాట్‌ల సేకరణకు ప్రభుత్వం దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చు చేసిందని, అయితే ప్రస్తుతం కేవలం 20,000 వీవీపీఏటీ స్లిప్పులు మాత్రమే ధృవీకరించడం జరుగుతుందని అరుణ్‌ కుమార్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

"అరాచకం సృష్టించడం"

ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. ఈ సమయంలో, ఈ దశలో అలా చేయడం "అరాచకం సృష్టించడం" అని కోర్టు పేర్కొంది. సెలక్షన్ ప్యానెల్‌లో మార్పుల తర్వాత కొత్త చట్టం ప్రకారం ఎంపికైన కొత్తగా ఎన్నికైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులపై ఎలాంటి అభియోగాలు లేవని వ్యాఖ్యానిస్తూ కోర్టు పేర్కొంది.

గతంలో ఓ సారి ఇదే అంశం గురించి ఏడీఆర్‌ దాఖలు చేసిన మరో అభ్యర్థనకు ఈ పిటిషన్‌ ట్యాగ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చివరిగా 2019 ఏప్రిల్‌ 8న ఎన్నికల టైంలో వీవీ ప్యాట్ ల వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ కి ఒక్కో వీవీ ప్యాట్‌ ను మాత్రమే వెరిఫికేషన్‌ చేసేవారు.అయితే అప్పట్లో దాఖలైన పిటిషన్‌ ను విచారించిన సుప్రీం.. ఓటర్‌ స్లిప్పులను లెక్కించే వీవీ ప్యాట్‌ సంఖ్యను ఐదుకు పెంచింది.

5 వేల కోట్లు ఖర్చు

వీవీ ప్యాట్ల వెరిఫికేషన్‌ లో భాగంగా నిర్వహించే ఓటరు స్లిప్పుల లెక్కింపు ప్రక్రియను అసెంబ్లీ నియోజకవర్గాలు కేవలం 5 -6 గంటల్లోనే పూర్తి చేయోచ్చని అరుణ్‌ వివరించారు. 24 లక్షల వీవీ ప్యాట్‌ ల కొనుగోలుకు గవర్నమెంట్‌ 5 వేల కోట్లు ఖర్చు పెట్టింది. అయితే ఇందులో 20 వేల వీవీఏటీ స్లిప్పులు మాత్రమే వేరిఫై అయినట్లు అధికారులు గుర్తించారు.

కాంగ్రెస్  హర్షం

ఈ లెక్కింపులో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈవీఎం, వీవీ ప్యాట్‌ ఓట్ల లెక్కింపులో చాలా తేడాలు వచ్చాయి. అందుకే వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించడం మంచిదని ఆయన వాదించారు. బ్యాలెట్‌ ఓటు కూడా సరిగా లెక్కించడం జరిగిందో లేదో సరిగ్గా తనిఖీ చేసుకోవాలని అరుణ్‌ అన్నారు. కాగా, ఈసీ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

Also read:  పెరుగుతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లే!

#ec #supreme-court #election-commission #vvpat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe