Hathras Stampede: హథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ.. ఎందుకంటే

హథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులు పరిష్కరించడానికి హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని.. ఈ ఘటనకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని పటిషనర్‌ను ఆదేశించింది.

New Update
Supreme Court on Promotions: ప్రమోషన్స్ విషయంలో అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: సుప్రీంకోర్టు 

Supreme Court: 121 మంది మృతికి కారణమైన హథ్రస్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులు దేశ ప్రజలను కలపారపాటుకు గురిచేస్తున్నాయని చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసులు పరిష్కరించడానికి హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని.. ఈ ఘటనకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని పటిషనర్‌ను ఆదేశించింది.

Also read: పేపర్ లీక్ కాకపోతే.. ఎందుకు అరెస్టులు చేశారు? NEET-UG  కేసులో జవాబులేని ప్రశ్నలెన్నో 

జులై 2న జరిగిన హథ్రస్‌ తొక్కిసలాట ఘటనపై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జ్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించాలని విశాల్‌ తివారీ అనే వ్యక్తి సుప్రీకోర్టులో పిటిషన్ వేసారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గాయాలపాలైనవారికి వెంటనే వైద్యం చేసేందుకు హాస్పిటల్‌లో అందుబాటులో లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య అని పిటిషనర్ చెప్పారు. ఈ సమస్యపై సుప్రీంకోర్టు దృష్టిసారించాలని కోరారు. అయినప్పటికీ పటిషన్‌ను విచారించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని ఆదేశించింది.

Also Read: భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. ఈ వగలాడి ఏం చేసిందంటే.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు