Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు

రేప్‌కు గురైన బాలికకు అబార్షన్‌కు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 30 వారాలను గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. దీనిని అసాధారణ కేసు కింద పరిగణించింది అత్యున్నత న్యాయస్థానం.

New Update
Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు

Supreme Court Permits 30 Weeks Pregnancy Abortion : మహారాష్ట్ర(Maharashtra) కు చెందిన 14 ఏళ్ళ బాలిక లైంగిక దాడి కేసులో ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఆమెకు 30 వారాల గర్భాన్ని విచ్చిత్తి చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇది అసాధారణమైనప్పటికీ బాలిక విషయంలో ఇదే న్యాయమని కోర్టు వ్యాఖ్యానించింది. తమ విస్తృత అధికారాలను ఉపయోగించుకుని తీర్పును వెలువరిస్తు్నామిన తెలిపింది.

బాలిక విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లి ముందుగా బాంబే హైకోర్టు(Bombay High Court) ను ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఈ నెల ఆరంభంలో పిటిషన్‌ దాఖలు చేసింది. కానీ బాంబే హైకోర్టు దాన్ని నిరాకరించింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ(Pregnancy) చివరి త్రైమాసికంలో ఉందని.. ఇప్పుడు విచ్ఛిత్తి చేస్తే పూర్తిగా రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశముందని అభిప్రాయపడింది. దీంతో బాలిక తల్లి పిటిషన్‌ను ఏప్రిల్‌ 4వ తేదీన కొట్టేసింది.

ఈ తీర్పు మీద బాధితురాలి తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ముందు సియాన్ మెడికల్ బోర్డు(Siyan Medical Board) నివేదికను కోరింది. అబార్షన్ చేస్తే బాలిక శారీరక, మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుంది. దీనికి బోర్డు కాన్పు జరిగి బిడ్డ పుట్టడం కంటే అబార్షన్ చేయడమే మంచిదని చెప్పింది. ఈ నివేదికను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద ఉన్న విస్తృత అధికారాలతో ఈ తీర్పు వెలువరిస్తున్నట్టు వెల్లడించింది. వెంటనే బాలికకు అబార్షన్ చేయాలని సియాన్ ఆసుపత్రికి డీన్‌కు ఆదేశాలు జారీ చేసింది. మామూలుగా చట్ట ప్రకారం ప్రతీ మహిళ లేదా అత్యాచార బాధితులు తమ గర్భాన్ని 24 వారాలకు వరకు తొలగించుకునే అవకాశం ఉంది. అది దాటితే మాత్రం కోర్టు అనుమతి తప్పక తీసుకోవాలి.

Also Read:PM Modi : ప్రచార సభలో కాంగ్రెస్, ముస్లింలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..ఈసీకి ఫిర్యాదు

Advertisment
తాజా కథనాలు