Delhi air polution:ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్

పంట వ్యర్థాలను కాల్చడం తక్షణమే ఆపాలని పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ, హరియాణా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వాయుకాలుష్యం రాజకీయ గొడవలకు దారి తీయకూడదని కోర్టు అభిప్రాయపడింది.

New Update
Delhi air polution:ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్

ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. దీని వల్ల అక్కడి ప్రజలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లాక్ డౌన్ ఇవ్వాలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది దేశ అత్యున్నత న్యాస్థానం సుప్రీంకోర్టు. పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ, హరియాణా రాష్ట్రాలు పంట వ్యర్థాలను కాల్చడం తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే దీని మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మీద కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ పొల్యూషన్ రాజకీయ యుద్ధానికి దారి తీయకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Also Read:ఇంత అవమానమా..మరీ ఇంతలా దిగజారాలా-ఏంజెలో మాథ్యూస్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వాల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ ఏటా ఇదొక ఇష్యూ కాకూడదని కోర్టు కోరింది. అలాగే ఢిల్లీ ప్రభత్వానికి కొన్న ఇసూచనలు కూడా చేసింది. బస్సులు కూడా ఎయిర్ పొల్యూషన్ కు కారణం అవుతున్నాయి. కాబట్టి వాటిని తగ్గించాలని చెప్పింది. అలాగే ఎక్కడా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వ్యర్ధాలు కాల్చకుండా చూడాలని ఆదేశించింది. తరువాత దీని మీద విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.

దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి కాలుష్యం పెరగడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ కాలుష్యం వలన ఢిల్లీలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. ఢిల్లీలో ఎన్ని ప్రభుత్వాలు మారిన కాలుష్యం నియంత్రించడంలో మాత్రం అన్నీ విఫలమైయ్యాయి. ఎన్ని చర్యలు చేపట్టిన గాలి నాణ్యత మాత్రం పెరగడం లేదు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత మరింత పడిపోవడంతో అక్కడి ఆప్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 13 నుండి నవంబర్ 20 వరకు ఒక వారం పాటు సరి-బేసి వాహన రేషన్ విధానాన్ని పునఃప్రారంభించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు