ఇంత నిర్లక్ష్యమా? మణిపూర్ ఘటనలో పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం...!!

మణిపూర్ వైరల్ వీడియోపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ సంఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది. మే 4న మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జరిగినప్పుడు, మే 18న ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.

author-image
By Bhoomi
Supreme Court: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు
New Update

మణిపూర్ వైరల్ వీడియో కేసులో సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. వీడియో బయటికి వచ్చిన తర్వాత మహిళలను నగ్నంగా ఊరేగించిన విషయం వెలుగులోకి వచ్చిందని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే ఇది మహిళలపై దాడులు లేదా వేధింపులకు గురైన సంఘటన మాత్రమే కాదన్నారు. గత మూడు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండ, మహిళలపై దారుణాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్ పోలీసుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు గుప్పించారు. ఈ అంశంపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి విచారణ జరగనుంది. మహిళలపై హింసకు సంబంధించిన విస్తృత అంశాన్ని పరిశీలించేందుకు ఒక యంత్రాంగాన్ని కూడా రూపొందించాలని సీజేఐ సూచించారు. ఈ వ్యవస్థ అటువంటి కేసులన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మణిపూర్‌లో హింస ప్రారంభమైన మే 3 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మణిపూర్ లో జరిగిన ఘటన ఎంతో భయంకరమైనదని వ్యాఖ్యానించారు.

మణిపూర్ హింసాకాండ, మహిళలపై జరిగిన దారుణాలపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. మణిపూర్ లో మునుపెన్నడూ లేనిరీతిలో హింసాకాండ చోటుచేసుకుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది నిర్భయ వంటి కేసు మాత్రమే కాదు...ప్రత్యేక ఘటన అంటూ పేర్కొంది. మీడియాలో పలు విషయాల గురించి వస్తున్నప్పటికీ..మణిపూర్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆధారాలు, వాస్తవాలు సేకరించకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. మణిపూర్ ఘటనపై సుప్రీం నిర్ణయం తీసుకుంటే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అదే సమయంలో కేంద్రం స్టేటస్ రిపోర్టు ప్రకారం 595 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

వీటిలో ఎన్ని లైంగిక హింసకు సంబంధించినవి, హత్యకు సంబంధించినవి అనే అంశంపై క్లారిటీ లేదన్నారు. మణిపూర్‌లో ఏం జరిగిందో, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఓ న్యాయవాది పిటిషన్‌ను ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ అభ్యర్థిని నగ్నంగా ఊరేగించిన వీడియో ఒకటి ఉందన్నారు. భారతదేశమంతటా మహిళలను సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉంటూ న్యాయవాది బీజేపీ నేత బాన్సూరీ స్వరాజ్ చేసిన విజ్ఞప్తిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిస్సందేహంగా, మహిళలపై నేరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు.

మహిళలపై జరిగిన దారుణాల కేసులకు సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గ ర లేదని..ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నదని బాధిత మహిళల తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇద్దరు మహిళలపై హింసకు పాల్పడిన వారికి పోలీసులు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. పోలీసులు ఈ మహిళలను జనంలోకి తీసుకెళ్లి వారిని విడిచిపెట్టారన్నారు. బాధిత మహిళల్లో ఒకరి తండ్రి, సోదరుడు హత్యకు గురయ్యారు. ఇంకా మృతదేహాల జాడ లేదని తెలిపారు. మే 18న జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైందని.. కోర్టు విచారణకు స్వీకరించినప్పుడు, ఏదో జరిగిందన్నార. అందుకే ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్వతంత్రమైన ఏజెన్సీని తాము కోరుకుంటున్నామంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ విషయంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళలిద్దరూ కేంద్రం, మణిపూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

#manipur #supreme-court #manipur-violence #justice-dy-chandrachud
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe