CM Kejriwal : ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కు సుప్రీంకోర్టు(Supreme Court) లో భారీ ఊరట లభించింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని ఆదేశం ఇచ్చింది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించకూడదని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారం కోసం మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా... విచారణ జరిపిన ధర్మాసనం కేజ్రీవాల్ కు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం తరఫున లాయర్లు కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించింది. లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడిగా కేజ్రీవాల్ ఉన్నారని.. ఆయనకు ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆధారాలను సాక్షులను ప్రలోభానికి చేస్తారని ఈడీ కోర్టు ఎదుట వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం చివరికి కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ తీర్పును వెల్లడించింది. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. జూన్ 1 వరకు బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.
ప్రచారానికి ఓకే:
ఢిల్లీ పరిధిలోని 7 పార్లమెంట్ స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆప్ అభ్యర్థుల తరఫున కేజ్రీవాల్ ప్రచారం చేసుకోవడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది న్యాయస్థానం. ఇంకా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించకూడదని స్పష్టం చేసింది.