ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో నిందితుడికి ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇంఛార్జి విజయ్ నయర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనేది రూల్, జైల్ అనేది మినహాయింపు అనే సూత్రాన్నే అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఊటంకించింది. కస్టడీలో ఉన్న నిందితుడికి అది జైలు శిక్ష కాకూడదని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్ నయర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలాఉండగా..
గత ఏడాది జులై 3న విజయ్ నయర్‌కు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 12న కోర్టు.. ఈ బెయిల్ పిటిషన్‌పై స్పందించాలని ఈడీని కోరింది.
Also Read: సీఎం రేవంత్‌కు అమిత్‌షా ఫోన్.. తెలంగాణకు తక్షణ సాయం!
చివరికి ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది. 2022, నవంబర్ 13న ఆయనను లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అలాగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ ఇచ్చింది. త్వరలోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ రావొచ్చని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: యువ శాస్త్రవేత్తను మింగేసిన ఆకేరు వాగు!