Supreme Court On CAA: సీఏఏ అమలు మీద ఇండియన్ ముస్లింలీగ్ దాకలు చేసిన పిటిషన్ మీద స్పందించాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాలలోపు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం (Central Government) సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఏప్రిల్ 8లోగా తమ స్పందన తెలియజేయాలని సుప్రీం కేంద్రాన్ని కోరింది. దీని మీద తదుపరి విచారణ ఏప్రిల్ 9న ఉంటుందని ప్రకటించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (D.Y. Chandrachud) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు వీటి మీద విచారణచేసింది.
సీఏఏ చట్టంలో (CAA Act) మతపరమైన అన్యాయాలు జరిగే అవకాశం ఉందని ముస్లీంలీగ్ పిటిషన్‌లో పేర్కొంది. దీని మీద సుప్రీంకోర్టులో మొత్తం 237 పిటిషన్లు దాఖలు అయ్యాయి. అందులో ముఖ్యమైనది ఇండియన్ ముస్లింలీగ్ (India Muslim League) దాఖలు చేసిన పిటిషన్. మిగతా పిటిషనర్లలో ప్రధానంగా కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీడ్, డెమోక్రటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ నేత జైరాం రమేష్, తృషమూల్ నాయకురాలు మహువా మోయిత్రా, ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీలు ఉన్నారు.
2019లో ఈ చట్టాన్ని (Citizenship Amendment Act) ప్రతిపాదించినప్పుడు కూడా చాలా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఆ టైమ్‌లో సీఏఏ నింబధన అమల్లోకి రాకపోవడంతో వాటిని కోర్టు విచారించలేదు. తాజాగా మార్చి 11న సీఏఏ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర హిందువులు, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ లేదా క్రిస్టియన్స్ డిసెంబర్ 31, లేదా అంతకంటే ముందు భారతదేశంలోకి ప్రవేశించివారు భారత పౌరసత్వం పొందడానికి అర్హులు. ఇందులో ముస్లింలకు అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న ముస్లిం లీగ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read: Bengaluru: పోలీసుల అదుపులో బీజేపీ నేత తేజస్వి సూర్య ..ఆజాన్ ఘటనలో నిరసనలు