Supreme Court: 'ఇన్ని రోజులు ఏం చేశారు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు..

బీఆర్ఎస్ పార్టీకి ఓ ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల గుర్తుల్లో కారును పోలి ఉన్న గుర్తులను రద్దు చేయాలంటూ ఇటీవలె బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే వీటిపై తాజాగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ రెండు పిటిషన్లను కొట్టివేసింది. మునుగోడు ఉపఎన్నికల్లో.. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని.. అధికార పార్టీ అయ్యుండి కూడా.. 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది

Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు
New Update

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ సర్కార్ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ మనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు ఇంకా తమ అభ్యర్థులను ఎన్నుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ రెండు విపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. నవంబర్ 30న రాష్ట్ర ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. అలాగే బీఎస్పీ, వామపక్ష పార్టీలతో సహా చాలామంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికలు బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఈనేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీకి ఓ ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల గుర్తుల్లో కారును పోలి ఉన్న గుర్తులను రద్దు చేయాలంటూ ఇటీవలె సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే వీటిపై తాజాగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ రెండు పిటిషన్లను కొట్టివేసింది. మునుగోడు ఉపఎన్నికల్లో.. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని.. జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ స్టిస్ అభయ్ ఎస్ ఓఖా,జస్టిస్ పంకజ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. అధికార పార్టీ అయ్యుండి కూడా.. 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారంటూ ప్రశ్నలు గుప్పించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టడం కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే తమకు హైకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలన్న బీఆర్ఎస్ తరపున న్యావవాదులు కోరారు. దీంతో హైకోర్టుకు వెళ్లొచ్చని సుప్రీం చెప్పింది. మెరిట్స్ ఆధారంగానే అక్కడ విచారణ జరుగుతుందని.. సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

#telangana-elections-2023 #supreme-court #telangana-news #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe