మార్గదర్శి కేసును బదిలీ చేయలేం.. ఏపీ సర్కార్ కి నో చెప్పిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ల కాలం చెల్లవని వెల్లడించింది సుప్రీం కోర్టు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగానే ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం..

New Update
మార్గదర్శి కేసును బదిలీ చేయలేం.. ఏపీ సర్కార్ కి నో చెప్పిన సుప్రీం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. మార్గదర్శి కేసులో సీఎంకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి కేసుల బదిలీకి నిరాకరించింది సుప్రీం కోర్టు. ఇటీవల మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ.. ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం న్యాయస్థానం తోసిపుచ్చింది. న్యాయ పరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ల కాలం చెల్లవని వెల్లడించింది సుప్రీం కోర్టు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగానే ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది.

మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి, తీర్పు చెప్పే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే వదిలేసింది సుప్రీం. కాగా మార్గదర్శి చిట్స్‌ను స్తంభింపజేయడంపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. దానిపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పుడు కూడా హైకోర్టు స్టేపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నో చెప్పిన విషయం తెలిపిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు