Supreme Court : వెనుకబడిన వర్గాలకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపినట్లైతే అది బుజ్జగింపు రాజకీయాలనే ప్రమాదకర ధోరణికి దారి తీస్తుందని హెచ్చరించింది. సమాజంలో అణిచివేత వర్గాలు చాలా ఉన్నాయని.. వాటిలో కొన్నింటికి మాత్రమే లబ్ధి చేకూర్చి ఇతరులకు రిజర్వేషన్లను దూరం చేయడం సరికాదని పేర్కొంది. ఆ ప్రయోజనాలను కోల్పోయినవారు ఆర్టికల్ 14(Article 14) (సమానత్వ హక్కు) కింద వర్గీకరణకు సవాలు చేస్తూనే ఉంటారని తెలిపింది.
Also Read : అంతరిక్షంలో మరోసారి సత్తా చాటనున్న భారత్.. రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలు
అందుకో దీన్ని నివారించేందుకు ఒక విధానాన్ని రూపొందించాల్సి వస్తుందని తెలిపింది. వెనకబాటుకు గురైన వర్గాలకు న్యాయం చేకూర్చేందుకు వర్గీకరణ అనేది ఉపకరిస్తుందని చెప్పింది. అయితే విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ(SC,ST) వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అనే దానిపై 3 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తన తీర్పును గురువారం నాడు రిజర్వు చేసింది. ఈ అంశంపై దాఖలైన 23 పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(Justice DY Chandrachud) నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. వివిధ పక్షాల తరపున వినిపించిన వాదనలను విచారించింది.
Also Read: ఉత్తరఖాండ్‌లో అక్రమ మదర్సా, మసీదు కూల్చివేత.. చెలరేగిన అల్లర్లు.. నలుగురు మృతి
అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కేసులో సుప్రీంకోర్టు 2004లో వెలువరించిన తీర్పుపై మరోసారి సమీక్ష జరపాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘిస్తుందన్న ఆ తీర్పులోని అభిప్రాయంతో విభేదించారు. సీజేఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనంలో జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్ తదితరులు ఉన్నారు.