National : ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం ఢిల్లీ మాజీ మంత్రి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సత్యేంద్ర వెంటనే పోలీసులకు లొంగిపోవాలని కోర్టు సూచించింది.

National : ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
New Update

AAP Ex Minister Satyendra Jain : ఎక్సైజ్ పాలసీ(Excise Policy) మనీలాండరింగ్ కేసు(Money Laundering Case) లో ఢిల్లీ(Delhi) మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌(Ex. Minister Satyendra Jain) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బేల ఎం త్రివేది బృందం ఢిల్లీ మాజీ మంత్రి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం జనవరి 17కు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం సత్యేంద్ర జైన్ మెడికల్ గ్రౌండ్స్ బెయిల్ మీదన ఉన్నారు.

అంతకు ముందు డిసెంబరు 14, 2023న, మాజీ మంత్రి జైన్‌కు వైద్యపరమైన కారణాలతో మంజూరైన బెయిల్‌ను కోర్టు జనవరి 8వరకు పొడిగించింది. కోర్టు సత్యేంద్ర బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది రెండోసారి. గతేడాది జూన్‌ నెలలో కూడా ఆయన బెయిల్‌ దరఖాస్తుని ఢిల్లీ కోర్టు కొట్టేసింది. మనీలాండరింగ్ కేసులో మే ౩౦వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యేంద్ర జైన్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని 2017 ఆగష్టు 24వ తేదీన సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీ(FIR Copy) ఆధారంగా ఈడీ(ED) ఇన్విస్టిగేషన్‌ మొదలుపెట్టింది.

Also Read : Delhi : ఎలక్టోరల్ బాండ్స్ పూర్తి వివరాలను వెల్లడించాలి-సుప్రీంకోర్టు

#satyendra-jain #aap-leader #supreme-court #delhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe