Supreme Court: :జీవం ఉన్న పిండం గుండె చప్పుడు ఆపాలని ఏ కోర్టు చెబుతుంది...సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కడుపులో ఉన్న పిండాన్ని చంపమని ఏ కోర్టు చెబుతుంది అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 26 వారాల గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఉన్నాయంటూ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక మీద సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది.

ఓటుకు నోటు కేసు విచారణ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
New Update

గర్భవిచ్చిత్తికి సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు అబార్షన్ కు అనుమతినివ్వాలంటూ రీసెంట్ గా ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని...మూడోవారిని పెంచే ఆర్ధిక స్థోమత లేదని ఆమె చెప్పింది. వీటిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అబార్షన్ కు అనుమినిచ్చింది. అక్టోబర్ 9న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. దాంతోపాటూ ఈ ప్రక్రియను చేపట్టాల్సిందిగా ఎయిమ్స్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే దాని తరువాత గర్భవిచ్చిత్తి చేసినా కూడా శిశువు బతికే అవకాశాలున్నాయని...అందుకే కోర్టు అబార్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఎయిమ్స్ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసు మీద మరోసారి విచారణను చేపట్టింది.

ఈ కేసు విచారణ నేడు సుప్రీంకోర్టులో జస్టాస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం చేశారు. మొదట ఎయిమ్స్ నివేదిక మీద ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మొదటే ఎందుకు శివఉవు బతికే అవకాశాలున్నాయని చెప్పలేదని ప్రశ్నించారు. అప్పుడే చెప్పి ఉంటే తీర్పు మరోలా ఉండేదని కోర్టు అభిప్రాయడింది. జీవం ఉన్న గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుంది అన్నారు. నేనైతే అస్సలు అలా చేయను అంటూ జస్టిస్ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు. అయితే మహిళ మాత్రం ఇప్పటికీ గర్భాన్ని ఉంచుకోవడానికి నిరాకరించారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం, బాధితురాలు ేకాభిప్రాయానికి రాలేదు.

మరోవైపు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించడం మీద జస్టిస్ నాగరత్నం అసహనం వ్యక్తం చేశారు. ఒక ధర్మాసనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి విజ్ఞప్తి లేకుండా సీజేఐ త్రిసభ్య ధర్మాసనం ముందు ఎలా అప్పీలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో అన్నాి ధర్మాసనాలు అత్యన్నతమైనవే అంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేశారు.

దేశంలో మహిళలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని ఇటీవలే సుప్రీంకోర్టు చారిత్రార్మక తీర్పును వెలువరించింది. 20 నుంచి 24 వరాలలోపు గర్భస్రావం చేయించుకునే హక్కు స్త్రీలు అందరికీ ఉందని స్పష్టం చేసింది. అయితే ఇప్పడు అబార్షన్ కోసం కోర్టుకు వచ్చిన మహిళ 26 వారాల గర్బం కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలని ద్విసభ్య ధర్మాసనం సీజేఐకి సూచించింది.

Also Read:పఠాన్ కోట్ దాడి సూత్రధారి లతీఫ్ ఖాన్ హతం

#abortion #supreme-court #delhi #comments
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe