Supreme Court: కాసరగోడ్ మాక్ పోలింగ్ ఆరోపణలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. ఇక్కడ ఉపయోగించిన ఈవీఎంలు సరిగ్గా పని చేయడం లేదని కాసరగోడ్ లోకల్ పార్టీలు అయిన ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు. ఈ నివేదికను అక్కడి పత్రిక మనోరమ కూడా ప్రచురించింది. దీన్ని ఆధారంగా చేసుకుని లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో చూపించారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ విషయం మీద చర్చించారు. ఇది మామూలు విషయం కాదని..దీన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపించాలని ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వెంటనే ఈవీఎంలను తనిఖీ చేయించాలని కోర్టు ఈసీని ఆదేశించింది.
కాసరగోడ్ మాక్ పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు అక్కడ లోకల్ పార్టీలు అయిన ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ అభ్యర్థులు. ఈవీఎం మెషీన్లు సరిగ్గా పని చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నాలుగు మెషీన్లలో బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఓటింగ్ మెషీన్ల మీద ఇతర గుర్తల కంటే కాంగ్రెస్ గుర్తు చిన్నగా ఉందని చెబుతున్నారు. వెంటనే ఈవీఎం మెషీన్లను మార్చాలని జిల్లా ఎన్నికల అధికారిగా నియమించబడిన జిల్లా కలెక్టర్ ఇన్‌బాశేఖర్ కెకి ఫిర్యాదు చేశారు. యుడీఎష్ అభ్యర్థి రాజ్‌మోహన్ ఉన్నితాన్ ఏజెంట్ ముహ్మద్ నాసర్ చెర్కలం ఈ ఆరోపణలను చేస్తున్నారు.
కాసరగోడ్‌లో జరిగిన మొదటి రౌండ్ మాక్ పోల్స్‌లో మొత్తం 190 ఈవీఎంలలో నోటీతో సహా 10 ఆప్షన్లతో ఉన్నాయి. మొత్తం 190 ఈవీఎంలలో టెస్ట్ నిర్వహించారు. పది ఆప్షన్లలో దేనికి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి లాంటివి పరిశీలించారు. ఇందులో బీజేపీకి అదనంగా ఓట్లు వస్తున్నట్టు గుర్తించారు. ఎన్నికల అధికారులు ఒకేసారి 20 మెషీన్లను టెస్ట్ చేశారు. 10 ఆప్షన్లలో అన్నింటికీ ఒక్కో ఓటే పడితే బీజేపీకి మాత్రం రెండేసి ఓట్లు పడ్డాయి. ఇలా నాలుగు ఈవీఎం మెషీన్లలో అవకతవకలు చూపించాయి.
అయితే రెండుసార్లు ఈవీఎం మెషీన్లను పరీక్షించినప్పుడు లోపాలు కనిపించాయని..కానీ మూడవసారి సరీక్షించినప్పుడు లేవని చెబుతున్నారు ఎన్నికల అధికారులు. అయితే అక్కడతో అవి ఆగిపోయాయా లేదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. ఈ మొత్తం నివేదికను కలెక్టర్‌కు ఇచ్చామని అసిస్టె్ంట్ రిటర్నింగ్ అధికారి బినుమోన్. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన మాక్ పోలింగ్‌లో మొత్తం 228 బ్యాలెట్ యూనిట్లు, 228 కంట్రోల్ యూనిట్లు, 247 వీవీప్యాట్ యూనిట్లను పరీక్షించారు. 228 యంత్రాల్లో ఆరు యంత్రాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి.వాటిని ఇంజనీర్లు సరిచేయడానికి పక్కన పెట్టారు.
Also Read:Telangana: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు