/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/raini-jpg.webp)
Rajinikanth : ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దానికి సూపర్ స్టార్ రజనీకాంత్ నే ఉదాహరణగా చెప్పవచ్చు. రెండు రోజుల క్రితం యూపీ పర్యటనలో భాగంగా శనివారం నాడు యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను కలిశారు. యూపీ సీఎం ఇంటి ముందు కారు నుంచి దిగగానే..తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన యోగి కాళ్లకు నమస్కరించారు రజనీకాంత్. రజనీని యోగి లేపే ప్రయత్నయం చేసేలోపే తలైవా ఆయన పాదాలకు నమస్కరం చేయడం క్షణాల్లో జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేయడం ప్రారంభించారు. కొంతమంది రజనీకాంత్ యోగి పాదాలను తాకడం సరికాదని కామెంట్స్ చేశారు. మరికొంతమంది సమర్ధించారు. అయితే ఈ విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.
#WATCH अभिनेता रजनीकांत से लखनऊ आने के उनके अनुभव के बारे में पूछे जाने पर उन्होंने कहा, "बहुत बढ़िया।"
— ANI_HindiNews (@AHindinews) August 21, 2023
उनसे अयोध्या में राम मंदिर के उनके दौरे के बारे में पूछे जाने पर उन्होंने कहा कि उनका दौरा बेहद शानदार रहा।
राज्य के कई राजनीतिक नेताओं के साथ अपनी बैठकों के बारे में… pic.twitter.com/QkYf4RYg50
వయసుతో నిమిత్తం లేకుండా 'సన్యాసి' లేదా 'యోగి' కాళ్లపై పడటం తనకు అలవాటని సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అన్నారు. ఇటీవల లక్నో పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై 'వివాదం'పై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో రజనీకాంత్ మాట్లాడుతూ.. 'సన్యాసి అయినా, యోగి అయినా.. వారి పాదాలపై పడటం నా అలవాటు. వాళ్లు నాకంటే చిన్నవాళ్లే అయినా. అదే నేను చేస్తాను అని అన్నారు. తన యూపి టూర్‌లో రజనీకాంత్, సిఎం యోగి పాదాలను తాకారు. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. 72 ఏళ్ల నటుడు యోగి పాదాలను తాకడమేంటీ అని వ్యాఖ్యానించారు. రజనీకాంత్ యోగి పాదాలను తాకిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక రజనీకాంత్ కూడా అయోధ్యలోని రాంలాలాను సందర్శించారు . ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన పర్యటన అద్భుతంగా సాగిందన్నారు. పలువురు రాజకీయ నేతలతో తాను జరిపిన సమావేశాల గురించి తలైవా చెప్పుకొచ్చారు. రజనీకాంత్ తన కొత్త చిత్రం 'జైలర్' అద్భుతమైన విజయాన్ని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో 2024 లోక్‌సభ ఎన్నికలపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదన్నారు.
Also Read: అయోధ్యలో సూపర్ స్టార్…హనుమాన్ గర్హిని దర్శించుకున్న రజనీకాంత్..!!