Rajinikanth : యోగి ఆదిత్యనాథ్ కాళ్లు ఎందుకు మొక్కారో క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్..!!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా, సినిమా ప్రమోషన్‌కు సంబంధించి లక్నో వెళ్లిన తలైవా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని ఆయన పాదాలను తాకారు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. రజనీకాంత్, యోగి ఆదిత్య నాథ్ పాదాలను తాకడం సరికాదని కామెంట్లు చేశారు. దీనికి సంబంధించి ట్రోలర్లకు తలైవా సమాధానం ఇచ్చారు.