HBD Mahesh Babu : టాలీవుడ్ లో మహేష్ కు మాత్రమే సొంతమైన ఏకైక రికార్డు ఏంటో తెలుసా?

టాలీవుడ్‌‌‌‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. నేడు(ఆగస్టు 9) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.

HBD Mahesh Babu : టాలీవుడ్ లో మహేష్ కు మాత్రమే సొంతమైన ఏకైక రికార్డు ఏంటో తెలుసా?
New Update

Mahesh Babu Birthday Story : టాలీవుడ్‌‌‌‌ (Tollywood) లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకరు. నట శేఖర కృష్ణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో.. ప్రస్తుతం టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. నేడు(ఆగస్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

publive-image

బాల నటుడిగా...

మహేశ్.. 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించాడు. తన నాల్గో ఏట దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైయ్యాడు. ఆ తర్వాత తండ్రి కృష్ణతో పలు చిత్రాల్లో లీడ్ రోల్స్ పోషించాడు. 'రాజకుమారుడు' సినిమాతో మహేశ్‌ సోలో హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్‌.. మహేష్ ను హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

publive-image

'మురారి' తో ఫస్ట్ బ్రేక్...

ఆ తర్వాత చేసిన యువరాజు, వంశీ చిత్రాలు ఆశించిన విజయాలు మహేష్ దక్కలేదు. కానీ నటుడిగా మహేష్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. వంశీ మూవీలో మహేష్ జోడిగా నటించిన నమ్రత ఆ తర్వాత అతని రియల్ లైఫ్ పార్టనర్ అయ్యింది. మహేష్ లోని నటుడిని వెలికితీసిన సినిమా 'మురారి'. కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన ఈ మూవీతో మహేష్ బంపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో మహేష్ కు అటు యూత్ లోను ఇటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా విజయంతో మహేష్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు.

publive-image

Also Read : ‘పుష్ప 2’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. ఒక చేతిలో గన్, మరో చేతిలో గొడ్డలితో భయపెడుతున్న భన్వర్ సింగ్!

మొదటి నంది...

మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం టక్కరిదొంగ. ఈ సినిమా టెక్నికల్ గా బాగా రిచ్ గా ఉన్నా…కథనం స్లోగా ఉండటంతో ఈ సినిమా సరైన సక్సెస్ సాధించలేదు. అయినా ఈ మూవీలో మహేష్ నటనకు.. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకున్నాడు. 2003లో మహేష్ నటించిన ‘ఒక్కడు’ ఒక సెన్సెషనే క్రియేట్ చేసింది. గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ చేసిన ఈ సినిమా యాక్టర్ గా మహేష్ ను ఒకమెట్టు పైకెక్కెలా చేసింది. హీరోగా సాఫ్ట్ రోల్సే కాదు అన్నిరకాల పాత్రలు పోషించి మెప్పించగలనని ‘అతడు’ మూవీతో నిరూపించాడు.

publive-image

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ తో పలికించిన డైలాగులు ఆడియన్స్ కు మెస్మరైజ్ చేశాయి. సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా బాక్సాఫీసు రికార్డలన్నిటిని ఈజీగా క్రాస్ చేసింది. ఇక మహేష్ కెరీర్ చెప్పాలంటే పోకిరి కి ముందు పోకిరి తర్వాత అనేంతగా మారిపోయింది. ఈ సినిమాతో పండుగాడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. అక్కడి నుంచి దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరూ, మహర్షి, సర్కారు వారి పాట, గుంటూరు కారం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

publive-image

రీమేక్ మూవీస్ కు నో...

నటనతో పాటే ఇతర రంగాల్లోనూ అందరికంటే ముందున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాదు..యాడ్స్ చేయడంలో కూడా ముందున్నారు. సినిమాలతో పాటు మరోవైపు నిర్మాణ వ్యవహారాలతో పాటు వ్యాపారాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క రీమేక్‌ సినిమాలో నటించని హీరో మహేశ్‌. బాలీవుడ్‌ నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా 'తెలుగు' చిత్రాల్లోనే నటిస్తానని వాటిని తిరస్కరిస్తూ వచ్చారు.

publive-image

8 నంది అవార్డులు

మహేశ్‌ కేవలం 27 సినిమాలకే 8 నంది అవార్డులు అందుకున్నాడు. 'రాజకుమారుడు'తో తొలిసారి ఉత్తమ నటునిగా నందిని అందుకున్న మహేశ్.. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్ చిత్రాల ద్వారా కూడా నంది అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఇదే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

publive-image

#hbd-mahesh-babu #mahesh-babu #tollywood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe