iPhone 17: యాపిల్ 17 లో బ్యాటరీ తీసే ఆప్షన్!

వచ్చే ఏడాది లాంచ్ కానున్నఆపిల్17 ఫోన్ లో నయా ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక నుంచి ఆపిల్ బ్యాటరీని సులభంగా తీసే ఫీచర్ ను ఆ కంపెనీ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఐరోపా దేశాల్లో ఆపిల్ పై ఆంక్షలు రావటమే ఈ మార్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

iPhone 17: యాపిల్ 17 లో బ్యాటరీ తీసే ఆప్షన్!
New Update

iPhone 17 Features: వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల కానున్న Apple iPhone 17 సిరీస్ బ్యాటరీలను రీప్లేస్ చేయడానికి సులభమైన మార్గాన్ని అందించనున్నట్టు ఓ నివేదిక పేర్కొంది. ఆపిల్ ఐరోపా దేశంలో కఠినమైన నిబంధనలను ఎదుర్కొంటున్నందున దాని ఉత్పత్తులలో కొత్త సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టవలసి యోచిస్తుంది. ఈ మార్పులతో!!! ఐఫోన్‌లను రిపేర్ చేయడం సులభతరం చేస్తాయి. బ్యాటరీని సులభంగా రీప్లేస్ చేసే సామర్థ్యం వీటిలో ఒకటి, దీనిని ఆపిల్ వచ్చే ఏడాది ఐఫోన్‌లలో పెద్ద మార్పుగా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

సాంకేతికతను యాక్సెస్ చేయడానికి పరికరాలను రిపేర్ చేయడానికి వినియోగదారులకు సులభమైన మార్గాలను ఆపిల్ అందించాలని EU కోరుతోంది. దీని కారణంగానే ఆపిల్ తన ఐఫోన్ డిజైన్‌లో మరో భారీ మార్పును తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం, 2025లో విడుదల కానున్న iPhone (iPhone 17 సిరీస్)తో Apple సంబంధిత నిబంధనలను పాటిస్తుంది.

ఐఫోన్ నుండి బ్యాటరీని తీసివేయడానికి ప్రస్తుత సెటప్ ప్రజలు సులభంగా చేయలేని విధంగా రూపొందించబడింది. కానీ యాపిల్ 17 నుంచి  బ్యాటరీని సులభంగా తీసివేసే ప్రక్రియ ప్రవేశపెడుతుంది. రాబోయే ఐఫోన్‌లో దీన్ని చేయడానికి ఆపిల్ ఒక యంత్రాంగాన్ని ప్రవేశపెడుతుందని నివేదిక పేర్కొంది.

Also Read: నెలకు ఐదువేలు అందుకునే కోటిమంది యువత ఎవరు? అర్హతలు ఏమిటి?

#tech-news #apple #iphone
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి