Murder: భర్త హత్యకు పుస్తెల తాడు అమ్మి మరీ సుఫారీ! వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య తన పుస్తెల తాడునే అమ్మి సుఫారిగా ఇచ్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలో మార్చి 17న జరిగింది. By Bhavana 25 Mar 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య తన పుస్తెల తాడునే అమ్మి సుఫారిగా ఇచ్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలో మార్చి 17న జరిగింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు గ్రామానికి చెందిన వనం ఈశ్వర్ (33) కు సూర్యాపేట కు చెందిన నవ్యతో 2015లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్దలు పంచాయతీ పెట్టి చివాట్లు పెట్టడంతో కొంతకాలంగా కలిసే ఉంటున్నారు. అయితే ఈశ్వర్ ఇంటిపక్కనే ఉండే సతీష్ అనే వ్యక్తితో నవ్యకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. దీని గురించి ఈశ్వర్ కు తెలియడంతో భార్యభర్తల మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఈశ్వర్ ను అడ్డుతొలగించుకోవాలని నవ్య, సతీష్ పన్నాగం పన్నారు. అందుకోసం నవ్య తన తాళిబొట్టునే సుఫారీగా ఇచ్చింది. దీంతో ఎర్రకుంటకు చెందిన లారీ డ్రైవర్ నక్క వీరాస్వామితో సతీష్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మరికొంత మందికి సతీష్ నగదును ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఈశ్వర్ కుటుంబంతో కలిసి పక్క ఊరికి వెళ్తున్న సమయంలో బండి చెడిపోవడంతో భార్య పిల్లలను ఆటోలో పంపి బండికిరిపైర్ చేయించుకుంటున్న క్రమంలో వీరస్వామి అతనితో పరిచయం పెంచుకుని మద్యం తాగించాడు. మళ్లీ తిరిగి నల్గొండ వెళ్దామని పిలవడంతో నమ్మి వచ్చిన ఈశ్వర్ మెడకు తాడు బిగించి మరో ఇద్దరు కలిసి హత్య చేశారు. మృతదేహన్ని తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఓ బావిలో పడేశారు. దీంతో సతీష్ వారికి రెండు తులాల బంగారు గొలుసు, 95 వేలు ఇచ్చాడు. గుర్తు తెలియని మృతదేహం దొరకడంతో పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. దీంతో పోలీసులు భార్య నవ్యను గట్టిగా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. Also read: గురుకులల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల! #murder #nalgonda #wife #suryapeta మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి