Sunny Leone : కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నీలియోన్..వైరల్ అవుతున్న హాట్ టికెట్

సన్నిలియోన్ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆమెకు అడ్మిట్ కూడా వచ్చింది.. అది కూడా ఒక ఫోటోతో కాదు...రెండు ఫోటోలతో. అంత సంపాదించిన సన్నీకి కానిస్టేబుల్ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..ఇది చదివేయండి మీకే తెలుస్తుంది.

New Update
Sunny Leone : కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నీలియోన్..వైరల్ అవుతున్న హాట్ టికెట్

Sunny Pic On Constable Hall Ticket : ప్రస్తుతం బాలీవుడ్(Bollywood) నటి సన్నీ లియోన్(Sunny Leone) పేరు తెగ వైరల్ అవుతోంది. మామూలుగానే సన్నీ అంటే క్రేజీ... హాట్ యాక్టరస్‌గా ఆమెకున్న పేరు మరెవరికీ రాలేదు. బాలీవుడ్ నటిగా, ఐటెమ్ సాంగ్ గర్ల్‌(Item Song Girl) గా ఫుల్ ఫేమస్. కానీ సన్నీ ఇప్పుడు మరో రకంగా ఫేమస్ అవుతోంది. అది కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై(Apply Constable Job) చేసుకుని. దానికి సంబంధించి ఆమెకు హాల్ టికెట్(Hall Ticket) కూడా వచ్చింది. దీన్ని చూసి.. సినిమాలు, యాడ్లు చేస్తూ కోట్లు సంపాదించే సన్నీ లియోన్.. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేసుకుంటుంది అని అంతా విస్మయానికి గురి అవుతున్నారు. ఆమె పేరు, ఫోటోతో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ హాల్ టికెట్ ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లో సన్నీ హాల్ టికెట్..

ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో అప్లై చేసుకున్న వారికి తాజాగా హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన హాల్ టికెట్లలో సన్నీ లియోన్ హాల్ టికెట్ కూడా ఉండటం విశేషం. దీంతో ఇప్పుడు ఆ హాల్ టికెట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విచిత్రంగా అడ్మిట్ కార్డులో సన్నీ లియోన్ ఫోటోలు రెండు ఉన్నాయి. సాధారణంగా అడ్మిట్ కార్డులో ఒకటే ఫోటో ఉంటుంది..కానీ సన్నీ కదా...అందుకే రెండు ఫోటోలు ఉన్నాయి.

Also Read : Inner Wear Problems : రాత్రి సమయంలో లోదుస్తులు ధరిస్తున్నారా? కష్టాలు తప్పవు

ఏం జరిగిందంటే...

సన్నీ పేరు మీద ఉన్న హాట్ టికెట్ ఫేక్(Hot Ticket Fake) అంటున్నారు పోలీసులు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎవరో సన్నీ ఫోటోను తప్పుగా అప్లోడ్ చేశారని స్పష్టం చేశారు. అప్లై చేసే సమయంలో వివరాలు మొత్తం తప్పుగా ఇచ్చిన ఆ వ్యక్తి.. చివరికి ఫోన్ నంబర్ మాత్రం తనది ఇచ్చాడు. అదిగో అక్కడే దొరికిపోయాడు. దీని ఆధారంగా సన్నీ ఫోటోను అప్లోడ్ చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు అతనికి నోటీసులు జారీ చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ వేళ ఉపయోగించిన మొబైల్ నంబర్ యూపీలోని మహోబాలో నివసించే వ్యక్తిది కాగా.. దాని అడ్రస్ మాత్రం ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read : IRCTC : ట్రైన్ బుకింగ్‌లో అదిరిపోయే ఫీచర్..అదిరిపోయింది గురూ

Advertisment
తాజా కథనాలు