INDIA Bloc Rally: ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్

దేశరాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తోంది. దీనికి కేజ్రీవాల్ భార్య సునీత హాజరయ్యారు. అక్కడ ఆమే కేజ్రీవాల్ పంపిన లేఖను చదివారు. ప్రధాని మోదీయే ఆయనను జైలుకు పంపారని సునీత వ్యాఖ్యలు చేశారు.

New Update
INDIA Bloc Rally: ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్

Sunitha Kejriwal: ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగంతో పాటు ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేస్తోంది ఇండియా కూటమి.సేవ్ డెమోక్రసీ అనే థీమ్‌తో కార్యక్రమం జరుగుతోంది. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్ష కూటమికి చెందిన 28 పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఈ ర్యాలీని చేస్తున్నారు. దీనికి కేజ్రీవాల్ భార్య సునీత కూడా హజరయ్యారు.

కేజ్రీవాల్ లేఖ..

ర్యాలీకి హాజరయిన సునీత కేజ్రీవాల్ రాసిన పంపిన లేఖను చదివారు. ప్రధాన మోదీయే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టించారని సునీత వ్యాఖ్యలు చేశారు. మోదీ చేసింది సరైన పనేనా అంటూ మండిపడ్డారు. కేజ్రీవాల్ సింహంలాంటి వ్యక్తని...కోట్ల మంది హృదయాల్లో ఆయన ఉన్నారని అన్నారు. సీఎం కేజ్రీవాల్ నిజాయితీ పరుడని మీరు నమ్మడం లేదా...ఆయన తన పదవికి రాజీనామా చేయాలా అంటూ ప్రశ్నించారు సునీత. ఇక కేజ్రీవాల్ పంపిన లెటర్‌ను చదువుతూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. వైద్య, విద్యతో పాటూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. విపక్ష కూటమికి అవకాశం ఇస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తామని కేజ్రీవాల్ తెలిపినట్లు సునీత చెప్పారు. భారత మాత ఇబ్బందుల్లో ఉందని..దూర్జన్యం చేయడం సరైన పని కాదని సునీత అన్నారు. దేశ వ్యాప్తంగా కేజ్రీవాల్‌కు ఎంతో మద్దతు లభిస్తోందని తెలిపారు.

Also Read:Telangana: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Advertisment
తాజా కథనాలు