BREAKING: సునీత విలియమ్స్ లేకుండానే.. భూమిని చేరిన వ్యోమనౌక!

వ్యోమగాములు లేకుండానే బోయింగ్‌ చేపట్టిన తొలి స్టార్‌లైనర్‌ వ్యోమనౌక భూమిని చేరింది. ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి శుక్రవారం రాత్రి ఖాళీ క్యాప్సుల్‌తో తిరిగొచ్చింది. టెక్నికల్‌ సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది.

Sunita Williams: అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వెంటనే సునీతా విలియమ్స్ ఏం చేసిందంటే..
New Update

BREAKING:  వ్యోమగాములు లేకుండానే బోయింగ్‌ చేపట్టిన తొలి స్టార్‌లైనర్‌ వ్యోమనౌక భూమిని చేరింది. ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి శుక్రవారం రాత్రి ఖాళీ క్యాప్సుల్‌తో తిరిగొచ్చింది. టెక్నికల్‌ సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ మేరకు జూన్‌ 5వ తేదీన సునీత విలియమ్స్‌తో పాటు అమెరికాకు చెందిన మరో వ్యోమగామి విల్‌ మోర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే.

అయితే జూన్‌ 26న సునీతా విలియమ్స్ తిరిగి రావాల్సి ఉండగా టెక్నికల్ ఇష్యూ కారణంగా వాయిదా పడింది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS.. రష్యాకు చెందిన ఓ ఉపగ్రహం పనికిరాని శకలాలు ఉండడంతో యాత్రకు ఆటంకాలు కలుగుతున్నట్లు తెలిపింది. వ్యోమనౌకలో హీలియం లీకేజ్ అవుతోందని, నాసా శాస్త్రవేత్తలు రిపేర్‌ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి సెప్టెంబర్ 14 వ తేదీన సునీత భూమి మీదకు చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రయాణం 26వ తేదీకి వాయిదా పడింది. కానీ మరోసారి టెక్నికల్‌ సమస్యల కారణంగా ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది.

#sunita-williams #boing #starliner-spaceship
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe