SRH Vs CSK IPL 2024: హైదరాబాద్‌లోని ఉప్పల్ (Uppal) స్టేడియంలో హైదరాబాద్-చెన్నై మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన హైదరాబాద్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చైన్నై జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. చైన్నైకి భీకర బ్యాటర్స్ ఎలా ఉన్నారో.. సన్‌రైజర్స్‌కు (Sunrisers Hyderabad) కూడా బలమైన బౌలర్స్ ఉన్నారు. దీంతో ఈ ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ టీమ్‌లోకి తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. విశాఖపట్నంలోని ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓటమిని చూసిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings).. హైదరాబద్‌లో జరగుతున్న మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. సీనియర్ ఫాస్ట్ బౌలక్ ముస్తఫిజర్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. ఇప్పుడు పతిరణ కూడా ఆడటం లేదని కెప్టెన్ రుతురాజ్ (Ruturaj Gaikwad) టాస్ జరిగిన తర్వాత చెప్పాడు. దీంతో ఈ జట్టులోకి తీక్షణ, ముకేశ్ చౌదరి, మొయిన్ అలీ వస్తున్నారు. అయితే మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పటికీ చైన్నై జట్టు అభిమానులతో స్టేడియం అంతా పసుపుమయంగా మారింది.
Also Read: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు… కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్
ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్ హైదరాబాద్ 277 పరుగుల భారీ స్కోర్ చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కూడా బారీ స్కోర్ చేయాలని పట్టుదలతో ఉంది. 2016లో తన మొదటి ఐపీఎల్ సీజన్‌లో 17 వికెట్లతో సత్తా చాటిన ముస్తాఫిజుర్ రెహ్మాన్.. ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత కూడా ఇంకా చైన్నై ఓ కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఎలాంటి బౌలర్లనైనా ఎదుర్కోనే బ్యాటర్లు హైదరాబాద్ టీమ్‌కు కూడా ఉన్నారు.
అభిషేక శర్మ తన ఆటను ఇలాగే కొనసాగిస్తే.. చెన్నైకి కష్టాలు మొదలయ్యే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్, మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెస్‌లు చెలరేగిపోయారంటే.. చెన్నై బౌలర్లు తిప్పలు పడక తప్పదు. చెన్నైకి మంచి హిట్టర్ అయిన శివమ్ దూబే ఉన్నాడు. డారిల్ మిచెల్ కూడా భారీ సిక్సర్లు తేలికగా కొట్టగొలడు. ఇదిలాఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ - హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చైన్నై.. 15 మ్యాచ్‌లు గెలవగా.. సన్‌రైజర్స్ మరో 5 మ్యాచుల్లో గెలిచింది. ఇప్పుడు జరగనున్న ఈ మ్యాచ్‌ను ఇరుజట్ల అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
Also read: రాగాల రెండు రోజులు వడగాల్పులు.. బయటకు రావొద్దని హెచ్చరిక