Sun : తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి.

Sun : తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
New Update

Sun Effect : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Sun) మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మే, జూన్‌ నెలల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఏప్రిల్‌ తొలివారంలోనే భానుడు తీవ్రరూపం దాల్చాడు. అంతేకాకుండా ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు విలవిల్లాడుతున్నారు. భానుడి భగభగలతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తెలంగాణ(Telangana), ఏపీ(Andhra Pradesh) లోని అనేక ప్రాంతాల్లో సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని నేడు 63 మండలాలలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నోట్లో ఈ సమస్యలు ఉంటే అది విటమిన్‌ లోపమే

తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 130 మండలాల్లో వడగాలులు వీచాయి. రేపు 38 మండలాల్లో తీవ్ర వడగాలులు(Hail Storms) వీచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయని చెబుతున్నారు. ఈ ఏడాది మాత్రం దాదాపు అన్ని జిల్లాల్లోనూ భానుడి తీవ్రతతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు. రానున్న 2 రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అంటున్నారు. అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: తలలో పేలను సులభంగా తరిమికొట్టండి..మళ్లీ జీవితంలో రావు

#andhra-pradesh #telangana #heat-waves #sun #hail-storms
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe