Sukumar : 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ పాత్ర ఎంత హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ తోనే నడుస్తుంది. పుష్పరాజ్ ప్లాష్ బ్యాక్ చెప్పేది కూడా కేశవే. ఈ పాత్రలో నటుడు జగదీశ్ బండారి అద్భుతంగా నటించాడు. తన న్యాచురల్ ఫెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. బన్నీ తర్వాత సినిమాలో బాగా ఎలివేట్ అయిన పాత్ర కూడా ఇదే. ఇక ఈ సినిమా తర్వాత జగదీశ్ ఫుల్ పాపులర్ అయిపోయాడు. అయితే నిజానికి ఈ రోల్ ని మొదట ఓ యంగ్ హీరో చేయాల్సిందట.
తాజాగా ఇదే విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ యంగ్ హీరో మరెవరో కాదు మన 'కలర్ ఫోటో' హీరో సుహాస్. అర్జున్ వైకె దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ప్రసన్నవదనం'. మే 3 న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఇందులో భాగంగానే సుహాస్ గురించి మాట్లాడుతూ.." సుహాస్ నువ్వంటే నాకు, బన్నీకి చాలా ఇష్టం. నీ ఎదుగుదల చూస్తున్నాం. పుష్ప సినిమాలోని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవగా ముందు నిన్నే అనుకున్నాం. కానీ అప్పటికే హీరోగా చేస్తున్న నిన్ను ఈ రోల్ కి సెలెక్ట్ చేయడం బాగోదనిపించింది. నాని యాక్టింగ్ నాకు బాగా ఇష్టం. సుహాస్, ఫ్యూచర్ నాని లాగా అనిపిస్తున్నాడు. నాని సహజ నటుడు కాబట్టి, సుహాస్ ని మట్టి నటుడు అనాలేమో. అంతగా ప్రతీ పాత్రలో ఇమిడిపోతాడు" అని చెప్పుకొచ్చాడు. దీంతో సుహాస్ పై సుకుమార్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు 'పుష్ప' సినిమాలో కేశవ క్యారెక్టర్ సుహాస్ కనుక చేసుంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read : ‘Kalki 2898 AD’ నుంచి ప్రభాస్ లుక్.. వీడియో చూస్తే గూస్ బంప్సే!