Deputy CM Pawan Kalyan: ఈరోజు సాయంత్రం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు కలిసారు. తన కుటుంబంతో కలసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. తన కూతురు ప్రీతి మీద అఘాత్యం చేయడమే కాకుండా హత్య కూడా చేశారని...ఈ కేసును గత ప్రభుత్వం సీబీఐకు అప్పగించారు. కానీ అలాంటివేమీ జరగలేదని ప్రీతి తల్లి ఆవదన వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని పార్వతి పవన్ కల్యాణ్‌ను కోరారు. దీని మీద స్పందించిన పవన్ కళ్యాణ్.. పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉండే ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి. ఈమె ఒక రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. అయితే తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్ శంకర్.. 20 ఆగస్టు 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో సైతం అమ్మాయిని రేప్ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ జి.బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 21 ఆగస్టు 2017న నివేదిక ఇచ్చారని ప్రీతి తల్లిదండ్రులు తెలిపారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. దీని మీద అప్పటి నుంచి దర్యాప్తు నడుస్తూనే ఉంది. కానీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రీతి తల్లిదండ్రులు.
Also Read:Paris Olympics: మజాలు చేస్తే ఆటలు కట్..ఒలింపిక్స్ నుంచి బ్రెజిల్ స్విమ్మర్ ఔట్