Mindful CEO:కుమారుడి మృతదేహం దగ్గర లేఖ రాసిన పెట్టిన సీఈవో

నాలుగేళ్ళ కొడుకు హత్య చేసిన కేసులో అరెస్టైన మైండ్‌ఫుల్ ఏఐ సంస్థ సీఈవో సుచనా సేథ్ గురించి రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెబుతున్నారు. ఎప్పటికీ కొడుకు తనకే దక్కాలంటూ మృత దేహం దగ్గర లేఖ రాసి పెట్టిందని పోలీసులు చెబుతున్నారు.

New Update
Mindful CEO:కుమారుడి మృతదేహం దగ్గర లేఖ రాసిన పెట్టిన సీఈవో

Suchna Seth:మైండ్ పుల్ సీఈవో సుచనా సేథ్ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని చెబుతున్నారు పోలీసులు. నాలుగేళ్ళ కొడుకును చంపిన కేసులో అరెస్ట్ అయిన సుచనా కేసు విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదుట. దాంతో పాటూ చేసిన పనికి ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఆమెకు మానసిక, శారీరక వైద్య పరీక్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కస్టడీ తనకే కావాలని..
ఇక భర్తతో విడాకులు అయిన దగ్గర నుంచి ఆమె మానసిక పరిస్థితి బాలేదు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కుమారుడి కస్టడీ భర్తకు అంశం విషయంలో కూడా ఆమె తీవ్రమనస్తాపానికి గురైందని చెబుతున్నారు. కొడుకుని చంపి పెట్టిన బ్యాగులో ఒక లెటర్ దొరికిందని... టిష్యూ పేపర్‌ మీద ఐ లైనర్‌తో రాసిందని చెబుతున్నారు. ఏం జరిగినా నా కొడుకు నా దగ్గరే ఉండాలి. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే, కస్టడీ హక్కు నాకే దక్కాలి అంటూ రాసిందని పోలీసులు చెబుతున్నారు.

Also read:ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు.. హనుమాన్ హిట్ – ఆదిపురుష్ మీద ట్రోలింగ్

జరిగిందిదీ..

నాలుగేళ్ల చిన్నారిని, కన్న కొడుకుని మైండ్‌ఫుల్ AI ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, CEO సుచనా సేథ్‌ హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జనవరి 6న తన కుమారుడితో కలిసి గోవా(Goa)లోని సోల్ బన్యన్ గ్రాండే హోటల్‌కు వెళ్లిన సుచన… అక్కడ కొడుకును చంపేసి జనవరి 8 హోటల్ నుంచి చెక్ అవుట్ చేశారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సుచనా సేథ్‌ తన భర్తతో-బిడ్డ కలవకుండా నిరోధించేందుకే ఈ దారుణమైన చర్యకు పాల్పడింది. హోటల్‌ సిబ్బందికి అనుమానం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆమె కీలక విషయాలు చెప్పింది.

ఆత్మహత్య చేసుకోవాలనుకుంది:
గోవాలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిన బెంగళూరుకు చెందిన సుచనా సేథ్‌ ఎడమ మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని ప్రాథమిక విచారణలో పోలీసులకు చెప్పింది. అయితే ఆ తర్వాత సుచనా సేథ్ మనసు మార్చుకుని రూ. 30,000 ఖరీదు చేసే టూరిస్ట్ క్యాబ్‌లో కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో నింపుకుని బెంగళూరు వెళ్లిపోపోయిందని పోలీసులు తెలిపారు. 39 ఏళ్ల వ్యాపారవేత్తను కర్ణాటకలోని చిత్రదుర్గలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అపార్ట్‌మెంట్‌లోని సిబ్బంది ఆమె గదిలో ఎరుపు మరకలను గుర్తించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు సేథ్ క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించి చివరికి CEOని అరెస్టు చేశారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా చిన్నారి మృతదేహం లభ్యమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు