CEO Kills Son: నాలుగేళ్ల కుమారుడి దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే బెంగళూరు సీఈవో క్రైమ్ కథ! 'ది మైండ్‌ఫుల్ ఏఐ' ల్యాబ్ సీఈవో సుచనా సేథ్ కర్ణాటకలోని చిత్రదుర్గలో తన 4ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో తరలిస్తుండగా అరెస్ట్ అయ్యారు. విడిపోయిన భర్తతో కొడుకు కలవకూడదని సుచనా ఈ హత్య చేసినట్టు సమాచారం. గోవాలోని ఓ హోటల్ గదిలో సుచనా చిన్నారిని హత్య చేసింది. By Trinath 09 Jan 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి బెంగళూరు(Bangalore) స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో గోవాలోని ఓ హోటల్‌లో తన 4 ఏళ్ల కొడుకును హత్య చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని ట్యాక్సీలో బెంగళూరు వెళ్లింది. గోవా పోలీసుల సమాచారం మేరకు కర్ణాటక పోలీసులు మహిళా సీఈవోని అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరిమే? మహిళను 39 ఏళ్ల సుచనా సేథ్(Suchana Seth)గా గుర్తించారు. ఆమె మైండ్‌ఫుల్ AI ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, CEO కూడా. జనవరి 6న తన కుమారుడితో కలిసి గోవా(Goa)లోని సోల్ బన్యన్ గ్రాండే హోటల్‌కు వెళ్లింది. జనవరి 8 హోటల్ నుంచి చెక్ అవుట్ చేశారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుచనా సేథ్ కలవకుండా చేయడం కోసమేనా? పోలీసుల సమాచారం ప్రకారం.. సుచనా సేథ్ తన భర్తతో-బిడ్డ కలవకుండా నిరోధించేందుకే ఈ దారుణమైన చర్యకు పాల్పడింది. ఈ జంట 2010లో వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు 2019లో జన్మించాడు. అయితే, వివాదాల కారణంగా 2020లో విడాకుల కోసం దాఖలు చేశారు. ఆదివారాల్లో తన బిడ్డను కలిసేందుకు తండ్రికి కోర్టు అనుమతినిచ్చిందని గోవా డీజీపీ జష్‌పాల్ సింగ్ ధృవీకరించారు. తన భర్త తమ కొడుకును చూడకుండా ఆపాలనే ఆలోచనతోనే నిందితురాలు తన బిడ్డతో కలిసి గోవా పర్యటనకు ప్లాన్ చేసింది. షెడ్యూల్‌కు ముందు నార్త్ గోవాలోని హోటల్ గదిలో చిన్నారిని హత్య చేసింది. మహిళ తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. చెక్ అవుట్ మాత్రం ఒంటరిగా వెళ్లిపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. Speechless at the evil act Suchana Seth! How can ANY mother slit the throat of her 4 year old child just because she wants to teach her estranged husband a lesson? Even assuming she was mentally sick, how did no one around her, her family, friends spot no warning signs? I… — Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) January 9, 2024 పోలీసులకు సమాచారం: సుచనా సేథ్ వద్ద పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉందని, కానీ ఆమె తీసుకువచ్చిన కుమారుడు చెక్ అవుట్ సమయంలో మహిళా సీఈవోతో లేరని హోటల్ సిబ్బంది గమనించారు. ఇది మాత్రమే కాదు, సుచనా సేథ్ గోవా నుంచి బెంగుళూరుకు వెళ్లడం కోసం ఆమె హోటల్ సిబ్బందిని టాక్సీ బుక్ చేయమని కోరారు. గోవా నుంచి బెంగుళూరుకు టాక్సీలో వెళ్లే బదులు ఫ్లైట్ ఎక్కితే బాగుంటుందని సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత కూడా ఆమె విమానంలో కాకుండా టాక్సీలో వెళ్లాలని, ఎవరికైనా ఫోన్ చేయాలని పట్టుబట్టిందని హోటల్ సిబ్బంది పోలీసులు చెప్పారు. ట్యాక్సీ బుకైన తర్వాత అందులో బెంగళూరుకు బయలుదేరింది. అయితే హౌస్ కీపింగ్ చేసేవారు తమ గదిలో శుభ్రం చేస్తుండగా రక్తపు మరకలను గమనించడంతో హోటల్ సిబ్బందికి అనుమానాలు బలపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కవర్ చేసే ప్రయత్నం: హోటల్ సిబ్బంది సమాచారంతో వెంటనే బరిలోకి దిగిన పోలీసులు సుచనతో పాటు ట్యాక్సీ డ్రైవర్‌ను కాంటాక్ట్ అయ్యారు. డ్రైవర్‌ను పిలిచి మాట్లాడు. అటు సూచనా సేథ్‌తో కుమారుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. తన స్నేహితుడితో కొడుకు ఉన్నట్టు చెప్పుకొచ్చింది. పోలీసులు అడ్రెస్ అడగగా.. ఒక చిరునామా చెప్పింది. పోలీసులు ఆ అడ్రెస్‌కు చేరుకోగా అది నకిలీదని తేలింది. ఈ సారి పోలీసులు మళ్లీ ఇద్దరిని పిలిచారు. ట్యాక్సీ డ్రైవర్‌తో ఈసారి హిందీలోనో, ఇంగ్లీషులోనో కాకుండా కొంకణిలో మాట్లాడడంతో సూచనా సేథ్‌కి ఏమీ అర్థం కాలేదు. బెంగుళూరుకు తూర్పున 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌కు వాహనాన్ని తీసుకెళ్లాలని పోలీసులు టాక్సీ డ్రైవర్‌ను కోరారు. అతనూ అలాగే డ్రైవ్ చేశాడు. ఆపై పోలీసులు కారులో ఉంచిన బ్యాగ్‌ని తెరిచి చూడగా సుచన కుమారుడి మృతదేహం కనిపించింది. Also Read: సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ WATCH: #crime-news #bangalore #goa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి