ICC Rankings :మనకు తిరుగులేదు బాస్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకుల్లో భారత ఆటగాళ్ళు

వచ్చేశారు మనవాళ్ళు మళ్ళీ నంబర్ వన్ స్థానంలోకి పైకి వచ్చేశారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్‌గిల్, మహ్మద్ సిరాజ్ లు నంబర్ వన్ స్థానాలను కైవసం చేసుకున్నారు.

New Update
ICC Rankings :మనకు తిరుగులేదు బాస్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకుల్లో భారత ఆటగాళ్ళు

ICC ODI Rankings: వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న భారత్ ఆటగాళ్ళు రికార్డులను, ర్యాంకులను కూడా కొల్లగొడుతున్నారు. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకుల జాబితాలో తమ స్థానాలను మెరుగుపర్చుకుని శుభ్‌మన్‌గిల్ (Shubman Gill), మహ్మద్ సిరాజ్‌లు (Mohammed Siraj) మొదటి ప్లేస్‌లను సొంతం చేసుకున్నారు. ఇంతకు ముందు వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ఫస్ట్ ప్లేస్ లో ఉండేవాడు. ఇప్పుడు అతన్ని వెనక్కి నెట్టేసి శుభ్‌మన్‌గిల్ నంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చేశాడు. అలాగే బౌలర్లలో సిరాజ్ ఫస్ట్ ప్లేస్ ను కైవసం చేసుకున్నాడు.

Also Read: ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

ప్రస్తుతం గిల్ 830 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతని తర్వాత బాబర్ ఆజమ్ 824 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేలలో గిల్ ఎప్పటి నుంచో దూకుడు ఆటను ప్రదర్శిస్తున్నాడు. అయితే ఈ వరల్డ్ కప్ (World Cup 2023) లో అతని ఆట కొంచెం తగ్గింది. మొత్తం ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో శుభ్‌మన్ రెండు హాఫ్ సెంచరీలను మాత్రమే చేశాడు. అందులో శ్రీలంక మీద చేసిన 92 పరుగులు క్లాసీగా నిలుస్తున్నాయి. అయితే ఈ వరల్డ్ కప్లో గిల్ డెంగ్యూ కారణంగా మొదటి రెండు మ్యాచ్ లు ఆడలేదు.

మరోవైపు భారత్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో నిప్పులు చెరుగుతున్నాడు. కన్సిస్టింగ్‌గా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధుల గుండెల్లో భయం పుట్టిస్తున్నాడు. వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్‌లలో సిరాజ్ పెద్దగా ప్రబావం చూపించలేకపోయాడు. కానీ నెమ్మదిగా తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. శ్రీలంక మీద అతని ప్రదర్శన అయితే టాప్ క్లాస్ గా నిలుస్తుంది.

Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Advertisment
తాజా కథనాలు