భరత్ కెనడా మధ్య భగ్గుమన్న విబేధాలు
ఇండియా, కెనడాల మధ్య దౌత్యవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వాళ్లకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించేసింది. గతంతో పోలిస్తే దాదాపు 86 శాతం మంది భారతీయ విద్యార్థులు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.
భారత్, కెనడల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు మాత్రం ఏకరీతిలో ఉన్నాయని భారత్‌లోని కెనడా హెకమిషనర్ కెమెరూన్ మెక్కే అన్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలపై దౌత్యవివాదం ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా కెనడా ప్రధాని ట్రూడో మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పై పెద్ద నింద మోపారు. నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల హస్తం ఉందనడానికి తమ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును కావాలనే ఓ కెనడా అధికారి దెబ్బతీశాడని.. అక్కడి భారత రాయబారి సంజయ్ వర్మ ఆరోపించారు. కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో చేసిన ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉంటే సమర్పించాలంటూ డిమాండ్ చేశారు.
భారత్ దూకుడుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వణికిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కెనడాపై విరుచుకుపడ్డారు. కెనడాకు జైశంకర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ.. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి... మీ ప్రవర్తన అంతా ప్రపంచం చూస్తూనే ఉంది...ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదు...దమ్ముంటే ఆధారాలు చూపించడంటూ కెనడాకు సవాల్ విసిరారు.
2021 జనాభా లెక్కల ప్రకారం, కెనడాలో దాదాపు 14 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇది కెనడా మొత్తం జనాభాలో 3.7 శాతం. ఇందులో దాదాపు 7 లక్షల జనాభా సిక్కులు. కెనడా రాజకీయాలలో సిక్కు జనాభా మంచి ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ కారణంగా జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తాన్ మద్దతుదారులకు రక్షణ కల్పిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా-భారత్ మధ్య సంబంధాలు మరింత దిగజారి, భారతీయ విద్యార్థులు కెనడా వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించినట్లయితే, అది కెనడా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలిగిస్తుంది.
భారత్‌పై లేనిపోని ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌కు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. అంతకుముందు, తన దేశ పార్లమెంటులో, ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని న్యాయం జరిగేలా మాతో కలిసి పని చేయాలని నేను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని ట్రూడో అన్నారు.ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం ముందుకు రావాలని, మాతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చామని ఆయన అన్నారు.
కెనడాతో వివాదంలో తొలిసారిగా బద్ధ శత్రువైన చైనా భారత్‌కు అండగా నిలిచింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌పై జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను పాశ్చాత్య కూటమి ఎజెండాగా చైనా అభివర్ణించింది. భారత్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒత్తిడి వ్యూహంగా అభివర్ణించారు. అటు కెనడాతో సహా పాశ్చాత్య దేశాలై గ్లోబల్ టైమ్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.