Telangana : కూళ్లిపోయిన కూరగాయలతో నిరసన తెలిపిన హాస్టల్ విద్యార్థులు..

నిజామామాబాద్‌ జిల్లాలోని నాందేడ్‌ వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. రోడ్డుపైనే కూరగాయలు పడబోసి ఆందోళన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

Telangana : కూళ్లిపోయిన కూరగాయలతో నిరసన తెలిపిన హాస్టల్ విద్యార్థులు..
New Update

Hostel Students : కుళ్లిపోయిన కూరగాయలతో తమకు హాస్టల్లో భోజనం(Hostel Food) పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. రోడ్డుపై కూరగాయలు(Vegetables) పడబోసి ఆందోళన తెలిపారు. ఇర వివరాల్లోకి వెళ్తే.. నిజామామాబాద్‌(Nizamabad) జిల్లాలోని నాందేడ్‌ వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన కూరగాయలతో వంటలు చేస్తూ తమకు భోజనం పెడుతున్నారంటూ మండిపడ్డారు. తమ సమస్యను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు.

Also Read: బండి సంజయ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

ఇలాంటి భోజనం ఎవరైన తింటారా అంటూ ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనల వల్ల రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేశారు.

Also read: పోలీస్ శాఖలో విషాదం.. హెడ్‌ కానిస్టేబుల్ మృతి

#telugu-news #telangana-news #students #st-hostel #hostel-food
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe