VC Ramesh: విద్యార్థి నేతలు ఆఫీస్‌ ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు

ప్రతిభ గల విద్యార్థులను క్యాటగిరీ వన్‌లో తీసుకున్నామని కాకతీయ యునివర్సిటీ వీసీ రమేష్‌ తెలిపారు. ఈ నెల 4న వీసీ ఛాంబర్‌లో మీటింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని వీసీ తెలిపారు.

New Update
VC Ramesh: విద్యార్థి నేతలు ఆఫీస్‌ ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు

ప్రతిభ గల విద్యార్థులను క్యాటగిరీ వన్‌లో తీసుకున్నామని కాకతీయ యునివర్సిటీ వీసీ రమేష్‌ తెలిపారు. ఈ నెల 4న వీసీ ఛాంబర్‌లో మీటింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని వీసీ తెలిపారు. విద్యార్థి సంఘ నేతలు తమపై దురుసుగా ప్రవర్తించారని, అంపర్లమెంరీ భాషతో తమకు అడ్మీషన్‌లు ఇస్తారా ఇవ్వరా అని ప్రశ్నించినట్లు వెల్లడించారు. తాము పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకు సీట్లు ఇవ్వరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు వీసీ వివరించారు. ఆఫీస్‌ ఫర్నీచర్‌ను ధ్వంసం చేస్తుంటే తాము పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. మరోవైపు దీనిని ఓ ఎమ్మెల్యే రాజకీయం చేస్తున్నారని, తాము పోలీసులతో విద్యార్థులను కొట్టించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

ఈటల రాజేందర్‌ ఎమన్నాడంటే.!

పీహెచ్‌డీ అడ్మిషన్‌ విషయంలో మెరిట్‌ పాటించడంలేదని కాకతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. యూనివర్సిటీ వీసీని కలిసేందుకు వెళ్లిన బీసీ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. వర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల.. బీఆర్‌ఎస్‌కు వీసీ రమేష్‌ తొత్తుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యల గురించి అధ్యాపకులతో మాట్లాడి వాటిని పరిష్కరించుకునే సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. కానీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విద్యార్థులను కొట్టడం తెలంగాణ చరిత్రలో లేదని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

విద్యార్థులు తలుచుకుంటే సామ్రాజ్యలే కూలిపోయిన రోజులు ఉన్నాయని ఈటల గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులే అన్నారు. వీసీ తీరును యావత్‌ విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. విద్యార్థులను కొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు, వీసీకే చెందుతుందని ఈటల విమర్శించారు. వీసీ పర్మిషన్‌ లేకుండా పోలీసులు యూనివర్సిటీకి ఎలా వచ్చారన్న ఎమ్మెల్యే.. అలాంటిది వీసీ విద్యార్థులను కొట్టించడం ఏంటన్నారు.

Advertisment
తాజా కథనాలు