IPL-2024 : కొత్త సూర్యుళ్ళు ఉదయించారు.. సన్‌రైజర్స్ మారిపోయారు లాస్ట్ సీజన్ వరకు ఒక లెక్క..ఇప్పుడు ఇంకో లెక్క అంటున్నారు సన్ రైజర్స్ టీమ్. మొన్నటి వరకు బ్యాటింగులో తాబేళ్ళు...బౌలింగ్‌లో కుందేళ్ళుగా ఉన్న హైదరాబాద్ టీమ్ ఇప్పుడు మెరుపు వీరులు అయిపోయారు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు తమ పేరిట లిఖించుకుని కొత్త కథకు తెర తీసారు. By Manogna alamuru 28 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Sun Risers Hyderabad : సన్‌రైజర్స్(SRH) నత్తనడక బ్యాటింగ్‌కు పేరు. స్టైక్ రేట్ లేక నానా అవస్థలు పడే వారు. ఎప్పుడూ జట్టు స్కోరు 150 లోపునే. బౌలింగ్‌లో వీరులు అనిపించుకున్నా బ్యాటింగ్ అస్సలు ఉండేది కాదు. కానీ అదంతా పాత కథ. ఇప్పుడున్న ఆటగాళ్ళు కొత్త కథలు రాస్తున్నారు. రికార్డులను బద్దలు కొడుతూ వావ్ అనిపిస్తున్నారు. సన్‌రైజర్స్‌కు డేవిడ్ వార్నర్(David Warner) కెప్టెన్ అయిన దగ్గర నుంచి బ్యాటింగ్‌లో కొంచెం దూకుడు పెరిగింది. అయితే ఈ సీజన్‌లో అది పీక్స్‌కు వెళ్ళింది. దాంతోనే పదకొండేళ్ళుగా ఎవ్వరూ టచ్ చేయలేని ఆర్ సి బి(RCB) రికార్డును బద్దలు కొట్టగలిగారు. అప్పట్లో క్రిస్‌గేల్ చెలరేగి పోవడంతో బెంగళూరు టీమ్ 5 వికెట్లకు 263 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. దాన్ని ఇప్పుడు సన్ రైజర్స్ టీమ్ పక్కకు నెట్టేసి 277 పరుగులతో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ టీమ్‌లో అందరూ మురుపు వీరులే ఉన్నారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంగతి అందరికీ తెలిసిందే. అతనికి తోడు ఇప్పుడు జట్టులోకి హెన్రిచ్ క్లాసెన్, ట్రావిడ్ హెడ్ కూడా తోడయ్యారు. నిన్నటి మ్యాచ్‌లో హెడ్ విజృంభించేవాడు. ముంబయ్ బౌలర్ల మీద విరుచుకుపడిపోయాడు. వీళ్ళే ఇలా ఉంటే... వీళ్ళను మించి పోయాడు ఇండియన్ యంగ్ తరంగ్... అభిషేక్ వర్మ. ట్రావిడ్ హెడ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే...అభిషేక్ వర్మ 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి వారెవ్వా అనిపించాడు. ఇదొక రికార్డ్ మళ్ళీ. సరే వీళ్ళిద్దరూ ఔటయిపోయారు... హమ్మయ్య అనుకుంది ముంబై ఇండియన్స్(MI). కానీ తరువాత వచ్చిన క్లాసెస్ వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. 11 సిక్స్‌లతో వీరంగం చేసేసాడు. వచ్చిన దగ్గర నుంచి సిక్స్‌లు మాత్రమే కొడుతూ.. ఊచకోత కోశాడు. దీంతో ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డ్ సన్‌రైజర్స్ చేతుల్లోకి వచ్చేసింది. ఇలా ఒకరిని మించి ఒకరు ఆటగాళ్ళతో ప్రస్తుతం సన్‌రైజర్స్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బౌలింగ్‌లో ఎప్పటి నుంచో పటిష్టంగా ఉంది. హైదరాబాద్ టీమ్ ఇలానే కనుక మిగతా అన్ని మ్యాచ్‌లూ ఆడితే... ఈ టీమ్ తల రాత మారినట్టే. కప్పు ఈసారి చేతిలోకి వచ్చినట్టే అంటున్నారు ఫ్యాన్స్. Also Read : Weather Alert : వాతావరణంలో మర్పులు.. దేశంలో మార్చిలోనే వడగాలులు. #hyderabad #cricket #ipl-2024 #srh-v-s-mi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి