సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడును కొనసాగిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. శంఆషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపుకు మెట్రో ట్రైన్ పొడిగింపు చేయొద్దని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ పోర్టుకు ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మార్గం బావుందని అందుకే మెట్రోను ఆపేయాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. రాయదుర్గం-శంషాబాద్ మెట్రో ప్రాజెక్టను వెంటనే ఆపేయాలని ఆదేశించారు.
Also read:రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లగడపాటి రాజగోపాల్
కారిడార్-3లో భాగంగా రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో వేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 31 కి.మీల దూరానికి రూ.6,250 కోట్ల అంచనా వేసింది. అయితే ఇప్పుడు దీన్ని సీఎం రేవంత్ ఆపేశారు. దీని బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.కారిడార్-2లో భాగంగా ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయానికి రైలు మార్గం వేయాల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించి నిర్మాణ వ్యయం, సేకరించాల్సిన ఆస్తుల వివరాలపై నివేదికను రూపొందించనున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు.
ఫలక్‌నుమా నుంచి చంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పీ7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు మార్గం కొత్త మెట్రోలైన్. ఈ మెట్రో మార్గం దూరం 17.6 కి.మీ ఉంది. ఫలక్‌నుమా నుంచి చంద్రాయణగుట్ట, పహాడి షరీఫ్ మీదుగా ఎయిర్‌పోర్టుకు 22.9 కి.మీ దూరం ఉంటుంది. దీన్ని ఎల్బీనగర్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 11 కి.మీ మార్గంతో అనుసంధానం చేయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకూ 5 కి.మీ దూరాన్ని కూడా మెట్రో మార్గంతో కలపాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దీనికి ఆర్థికంగా సాధ్యాసాధ్యాల పరిశీలన చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వ్యయం, సేకరించాల్సిన ఆస్తులు, ప్రయాణికుల సంఖ్య, ఆదాయం లాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత సాధ్యమయ్యే మార్గాన్ని ఎంపిక చేస్తామని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.