Stock Market Today:నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం వరకు నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లుసాయంత్రానికి ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇవాళ ఉదయం కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్లు, నిఫ్టీ సూచీ 5పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.

New Update
Stock Market Today:నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు

Stock Market Today: ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) వివాదం కంటే US బాండ్ ఈల్డ్‌ల (US Bond Yields) పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. 10 ఏళ్లు యూఎస్ బాండ్ రాబడి 4.9 శాతం కంటే ఎక్కువగా ఉండటం స్టాక్ మార్కెట్‌లకు (Stock Market), ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లకు ప్రధాన ప్రతికూలంగా కొనసాగుతోందని వారు చెబుతున్నారు. మరోవైపు అమెరికా ఫెడ్ రేట్లు (America Fed Rates) పెరుగుతాయనే అంచనాలతో మదుపర్లు ముందడుగు వేయడం లేదు. దీంతో ఉదయం స్టాక్ మార్కెట్స్ మొదలయ్యే టైమ్‌కి సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టంతో 63,847 దగ్గర...నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,075 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 154 పాయింట్ల నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 8 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.26 దగ్గర ప్రారంభం అయింది.

Also Read: ఏషియన్ పారా గేమ్స్‌లోనూ శతక్కొట్టారు

సెన్సెక్స్ 30 సూచీల్లో ఎల్‌అండ్‌టీ, ఎంఅండంఎం, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఐటీసీ, హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎనటీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్ టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

మరోవైపు ఈ నెలలో 10 రోజుల పాటూ స్టాక్ మార్కెట్లు మూసి ఉండనున్నాయి. మొత్తంగా 10 రోజుల పాటు మార్కెట్లు పని చేయవు. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ (NSE) ట్రేడింగ్ నిలిపివేయనున్నాయి. శని, ఆది వారాలు మినహాయిస్తే ఈ నెలలో రెండు ముఖ్యమైన పండగలు వస్తున్నాయి. నవంబర్ 12న దీపావళి, నవంబర్ 27న గురునానయక్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూసి ఉంటాయి.

Also Read:చంద్రబాబును కలిసి కన్నీరు పెట్టుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు

Advertisment
తాజా కథనాలు