Stock Market Today : డౌన్ ట్రెండ్ తో మొదలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 115 పాయింట్ల నష్టంతో 65,560 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 19,640 దగ్గర కొనసాగుతోంది.

New Update
Stock Market Today : డౌన్ ట్రెండ్ తో మొదలైన స్టాక్ మార్కెట్లు

Stock Market Today: గురువారం ఉదయం దేవీ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు దేశీయ మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఉదయం మార్కెట్ మొదలయ్యే సమయానికి సెన్సెక్స్‌ (Sensex) 115 పాయింట్ల నష్టంతో 65,560 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 34 పాయింట్లు నష్టపోయి 19,640 దగ్గర ఉంది. నిన్న నిఫ్టీలో కనిపించిన పెరుగుదల, ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఒక్క రోజులో కనిపించిన అతి పెద్ద లాభం. బ్యాంక్ నిఫ్టీ కూడా 22.80 పాయింట్లు పతనమై 44,178 స్థాయి వద్ద ఉంది. బుధవారం బజాజ్ ఫైనాన్స్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కఠినమైన నిర్ణయం తీసుకుంది. 'eCOM', 'Insta EMI కార్డ్' విభాగాల కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే ఆపేయాలని బజాజ్ ఫైనాన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిన్న ఆదేశించింది. దీనివలన బజాజ్ ట్విన్స్ షేర్లు ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి...ఇది మొత్తం మార్కెట్ల మీద ప్రభావం చూపించింది.

Also Read: వీళ్ళు లేకపోతే అసలు మ్యాచ్ గెలిచేవాళ్ళమే కాదు..

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.18 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నిన్న అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఐరోపా మార్కెట్లు కూడా ఇదే బాటలో పయనించాయి. కానీ ఈరోజు ఉదయానికి మాత్రం యూఎస్ ఫ్యూచర్ ట్రేడ్స్ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి.

Also Read:అతను పొట్టివాడే కానీ పొగరు ఎక్కువ.. ప్రియాంక గాంధీ సెటైర్లు

Advertisment
తాజా కథనాలు