Stock Market Special Trading: ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవే.. కానీ పనిచేస్తుంది.. ఎందుకంటే.. 

స్టాక్ మార్కెట్ కు సాధారణంగా శని, ఆదివారాలు సెలవు రోజులు. ఈరోజు శనివారం కూడా  స్టాక్ మార్కెట్ పని చేస్తుంది. డిజాస్టర్ రికవరీ సైట్ పనితీరును పరిశీలించడానికి రెండు సెషన్స్ లో అంటే ఉదయం 9.15 నుంచి 10 వరకు తర్వాత, 11.30 నుంచి 12.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది.

Special Trading: ఈరోజు స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్.. ఎందుకంటే.. 
New Update

Stock Market Special Trading : స్టాక్ మార్కెట్లకు ప్రతి శని, ఆదివారాలు సెలవు రోజులు . కానీ, ఈరోజు శనివారం కూడా షేర్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. మార్చి 2 సెలవు రోజున కూడా మార్కెట్ తెరిచి ఉంటుందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే,  NSE ఫిబ్రవరి 14న ప్రకటించింది. ఈరోజు  రెండు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌లు ఉంటాయి. విపత్తు రికవరీ సైట్‌ను పరీక్షించడానికి ఇది జరుగుతోంది. అంటే, ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ పనిచేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా టెక్నీకల్ ప్రాబ్లమ్ ఎదురయ్యి.. ఆన్ లైన్ లో సైట్ పనిచేయకపోతే.. వేరే సైట్ నుంచి ట్రేడింగ్ ఆగకుండా జరిగేలా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా డిజాస్టర్ రికవరీ (DR) సైట్ రూపొందించారు. ఇప్పుడు దీనిని(Stock Market Special Trading) పరీక్షించబోతున్నారు. ఎపుడైనా ఏదన్నా అనుకోని అవాంతరం వస్తే ఈ డిజాస్టర్ రికవరీ సైట్ ఎలా పనిచేస్తుంది అనేదానిపై పరిశీలన జరపబోతున్నారు. ఇందుకోసం శనివారం కూడా ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 

నిజానికి గత నెల అంటే జనవరి 20 శనివారం నాడు ఈ డిజాస్టర్ రికవరీ సైట్ పరీక్ష(Stock Market Special Trading) చేయాలని అనుకున్నారు. అందుకోసం స్టాక్ మార్కెట్ పనిచేసింది కూడా. కానీ, అయోధ్య రామాలయ ప్రతిష్టాపన కారణంగా జనవరి 22న సోమవారం సెలవు ప్రకటించడంతో జనవరి 20వ తేదీన పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ నిర్వహించారు. డిజాస్టర్ రికవరీ పరీక్షను పోస్ట్ పోన్ చేశారు. 

ఈరోజు రెండు సెషన్స్ లో ట్రేడింగ్(Stock Market Special Trading) ఉంటుంది. ఒక సెషన్ ప్రైమరీ సైట్‌లో, మరొకటి డిఆర్ సైట్‌లో జరగనుంది. మొదటి సెషన్‌లో ఉదయం 9.15 నుండి 10 గంటల వరకు ప్రైమరీ సైట్‌లో, రెండవది డిఆర్ సైట్‌లో ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రత్యేక ట్రేడింగ్ ఉంటుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ ఉదయం 9 నుండి 9.08 వరకు అలాగే 11.15 నుండి 11.23 వరకు ఉంటుంది.

ఫ్యూచర్ - ఆప్షన్ కాంట్రాక్టులతో షేర్లతో సహా సెక్యూరిటీలలో ఎగువ, దిగువ సర్క్యూట్ పరిమితులు 5%గా ఉంటాయి. అంటే, షేర్లు ఈ పరిధిలో మాత్రమే హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇప్పటికే 2% బ్యాండ్‌లో ఉన్న స్టాక్‌లు ఈ బ్యాండ్‌లోనే ఉంటాయి.

Also Read : స్టాక్ మార్కెట్ పరుగులు.. ఆల్ టైమ్ హైలో సూచీలు 

ఈ ప్రత్యేక ట్రేడింగ్(Stock Market Special Trading) సమయంలో, లావాదేవీని ప్రాథమిక సైట్(PR) నుండి డిజాస్టర్ రికవరీ (DR) సైట్‌కి మార్చడం ద్వారా దాని పనితీరు చెక్ చేస్తారు.  సాధారణంగా, స్టాక్ మార్కెట్ ప్రాథమిక సైట్‌లో ఏదైనా పెద్ద అంతరాయం లేదా వైఫల్యం సంభవించినప్పుడు, ట్రేడింగ్‌ను కొనసాగించడానికి దానిని DR సైట్‌కి మార్చుతారు. 

నిన్న స్టాక్ మార్కెట్ రికార్డులు..
నిన్నఅంటే మార్చి 1న స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్(Sensex) 73,819 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని, నిఫ్టీ 22,353 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. అయితే తర్వాత కాస్త దిగజారి సెన్సెక్స్ 1245 పాయింట్ల లాభంతో 73,745 వద్ద ముగిసింది.

అదే సమయంలో నిఫ్టీ కూడా 355 పాయింట్లు పెరిగింది. 22,338 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 లాభపడగా, 7 పతనమయ్యాయి. చమురు-గ్యాస్, బ్యాంకింగ్ మరియు ఆటో షేర్లలో అత్యధిక పెరుగుదల కనిపించింది. నిఫ్టీలో టాటా స్టీల్ టాప్ గెయినర్‌గా నిలిచింది.

#nse #stock-market-special-trading #stock-market-news #bse #stock-market
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి